5 మిలియన్ ఫాలోవర్ల క్లబ్ లో దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి

0
604
Director S.S Rajamouli joined 5 million club

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా 2001 లో రూపొందిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి, తొలి సినిమాతోనే పెద్ద హిట్ అందుకున్నారు. ఇక ఆ తరువాత నుండి ఒక్కో సినిమాతో ఒక్కో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటూ తిరుగులేని దర్శకుడిగా దూసుకెళ్తున్న రాజమౌళి, ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాల అత్యద్భుత విజయాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పలు ప్రపంచ దేశాల్లో చాటిచెప్పి గొప్ప కీర్తిని గడించారు.

మొదటి నుండి తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులకు చేరువ అవుతూ వస్తున్న రాజమౌళి, నేడు తన ట్విట్టర్ అకౌంట్ లో మొత్తం 5 మిలియన్ ఫాలోవర్ల మైలు రాయిని అందుకున్నారు. ఈ విధంగా మన దేశంలో ఈ ఫీట్ ని అందుకున్న అతి తక్కువ మంది దర్శకుల్లో ఒకరిగా నిలిచారు దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్‘ సినిమా పై ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ ముగిసిన అనంతరం తమ సినిమా షూటింగ్ మొదలెట్టి, వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని ఇటీవల రాజమౌళి తెల్పడం జరిగింది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here