‘పద్మశ్రీ’ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి కుమారుడు చెంబోలు రాజా పుట్టినరోజు నేడు

1
534
Sirivennela Seetharama Sastry's Son Raja's Birthday

ప్రముఖ సాహిత్య రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి కుమారుడు చెంబోలు రాజా పుట్టినరోజు నేడు(మే 30). తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని వైవిధ్యమైన పాత్రలతో అందరినీ అలరిస్తున్న రాజా.. త్వరలో ఓ వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ చేయబోతున్నారు. ఫిదా, అంతరిక్షం, ఎవడు, హ్యాపీ వెడ్డింగ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, రణరంగం, మిస్టర్ మజ్ను, ఏబీసీడీ వంటి ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించిన రాజా ఇప్పడు వెబ్ సిరీస్‌లలోనూ తన హవా చాటుతున్నారు. అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ ‘సవ్వడి’ రాజా జర్నీలో ప్రముఖ పాత్ర వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘మస్తీ’ వెబ్ సిరీస్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న రాజా.. రాబోయే తన చిత్రాలు ‘వి’ ఇంకా ఇతర వెబ్ సిరీస్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన లీడ్ రోల్ చేయబోతున్న వెబ్ సిరీస్ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

1 COMMENT

  1. […] ప్రముఖ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కోరారు. తెలుగు ఫాంట్స్ ఎంత ఎక్కువగా […]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here