‘418’ కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. షోలన్నీ ఫుల్ అవుతున్నాయి. ఇది తప్పకుండా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేసే సినిమా: ప్రెస్ మీట్ లో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్
పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ లేటెస్ట్ సూపర్ హిట్ ‘418’. దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ రూపొందిన ఈ సినిమాతో కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయం అయ్యారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ కీలక పాత్రల్లో నటించారు అక్టోబర్ 23న విడుదలైన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్లో మైత్రీ నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ..“అందరికీ నమస్కారం. ‘418’ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నిన్నటి కంటే ఈరోజు చాలా బాగుంది. మేము చేసిన ఫస్ట్ హారర్ సినిమా ఇది. మా బ్యానర్‌కు ఇంత మంచి సినిమా చేసి పెట్టిన డైరెక్టర్ కీర్తన్‌కు థాంక్యూ. చాలా యంగ్ టీమ్‌తో చేసిన సినిమా ఇది. ఒక యంగ్ టీమ్‌తో పనిచేసి హిట్ వస్తే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి ఈ సినిమా మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అందరూ ఈ సినిమాను థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.”
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ..“కీర్తన్ ఎక్స్ట్రార్డినరీ స్టోరీ రాసి, సినిమాను అద్భుతంగా చేశాడు. సౌండ్ డిజైన్, మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా బాగుందని అందరూ అంటున్నారు. అదే సమయంలో సౌండ్ డిజైన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. టెక్నికల్‌గా సినిమా అద్భుతం. ప్రకీర్తన్ యంగ్ టీమ్‌ను సెలెక్ట్ చేసుకుని సినిమాను చాలా పెద్ద సక్సెస్ చేశాడు. ప్రీమియర్స్ అన్నీ ఫాస్ట్‌గా ఫుల్ అయ్యాయి. సినిమాకు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. నిన్నటి కంటే ఈరోజు ఇంకా బాగుంది. మంచి వర్డ్ ఆఫ్ మౌత్ వస్తోంది కాబట్టి రేపు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా రెండు మూడు వారాల రన్ వుంటుంది. మైత్రీలో మరో విభిన్నమైన సినిమా చేశామని తృప్తిగా ఉంది. కీర్తన్ ఎంతో కేర్ తీసుకుని సినిమాను రూపొందించాడు. మంచి సౌండ్ ఉన్న థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను చూడండి. ఇది నెక్స్ట్ లెవల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
మైత్రీ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సౌండ్ గురించి ఆడియన్స్ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగులో ఇలాంటి హారర్ సినిమా నేను చూడలేదు. డాల్బీలో చూస్తుంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంట్లో ఎన్ని హోమ్ థియేటర్లు పెట్టుకున్నా రాదు. పెట్టిన షోలు కూడా ఫుల్ అవుతున్నాయి. టికెట్ రేట్లు కూడా రీజనబుల్‌గానే ఉన్నాయి. తప్పకుండా మీరందరూ ఈ సినిమాను థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను.”
డైరెక్టర్ కీర్తన్ నాదగౌడ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. నిర్మాతలు నవీన్ గారు, రవి గారికి థాంక్స్. ప్రశాంత్ నీల్ గారు చాలా ప్రోత్సహించారు. ప్రేక్షకులు థియేటర్లలో మంచి ఎక్స్పీరియన్స్ పొందుతున్నారు. సౌండ్ డిజైన్‌కు కూడా చాలా మంచి పేరు వచ్చింది. మా టీమ్ అందరికీ థాంక్యూ.”
ప్రీతి పగడాల మాట్లాడుతూ.. “అందరికీ థాంక్యూ. హారర్ నా ఫేవరెట్ జానర్. ఈ క్యారెక్టర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా నిర్మాతలకు థాంక్స్. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థాంక్యూ.”
చరణ్ లక్కరాజు మాట్లాడుతూ.. “సినిమాకు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మేము ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకుల నుంచి గొప్ప రిసెప్షన్ అందుతోంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమాను మీరు థియేటర్లలో చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు.”
సౌండ్ డిజైనర్ అనుపమ్ మాట్లాడుతూ.. “నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థాంక్యూ. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సౌండ్ డిజైన్‌కు మంచి పేరు రావడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. తప్పకుండా ఈ సినిమాను మీరందరూ థియేటర్లలో చూడండి. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.”
మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ జీజీ మాట్లాడుతూ.. “నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థాంక్యూ. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. ఆడియో సాంగ్స్‌కు వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందరూ థియేటర్లలో చూడండి. మీ అందరికీ నచ్చుతుంది.”
నటీనటులు: చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: కీర్తన్ నాదగౌడ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
సమర్పణ: ప్రశాంత్ నీల్
సంగీతం: వెంకీ జీజీ
సినిమాటోగ్రఫీ: దినేష్ దివాకర్



