చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో రాణించి ఇప్పుడు హీరో అయ్యాడు తేజ. ‘‘ఓ బేబి’’ మూవీలో నటించి మంచి మార్కులు కొట్టేసాడు.తన క్యూట్ లుక్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న తేజ ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన ‘‘కాంటినెంటల్ కాఫీ’’ తో అసోసియేట్ అయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయనున్నాడు తేజ.
ఈ బ్రాండ్ కు సంబంధించి ఓ ఫొటో షూట్ కూడా చేశాడు హీరో తేజ. రెండు పోస్టర్స్, ఓ ప్రమోషనల్ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..ఈ ‘కాంటినెంటల్ కాఫీ’’ తో అసోసియేట్ అవ్వడం హ్యపీగా ఉందని తెలిపాడు. లాక్ డౌన్ లో ఇంట్లో ఉంటూ కాంటినెంటల్ కాఫీ తాగి రిలాక్స్ అవ్వండి అని అంటున్నాడు. సోలో హీరోగా ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకముందే తేజ కు ఇలాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ తో అసోసియేట్ అవ్వడం విశేషమనే చెప్పుకోవాలి