మే 20న తన జన్మదినం సందర్భంగా కరోనా నేపథ్యంలో ఎటువంటి ఫంక్షన్ లు చేయొద్దని తన అభిమానులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పారు. కాగా పలువురు సెలెబ్రిటీలు మాత్రం ఎన్టీఆర్ కి వీడియోల రూపంలో విషెస్ చెప్పేందుకు సిద్దమవుతున్నారు. హీరో విశ్వక్ సేన్ ఎన్టీఆర్ కోసం చేసిన ట్రిబ్యూట్ వీడియో మే 20 న విడుదల చేయనుండగా ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొన్న కంటేస్టెంట్స్ కూడా తమ విషెస్ ను వీడియో రూపంలో చెప్పనున్నారు. ఈ వీడియో ను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు.