మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా పలు సోషల్ మీడియాలో అకౌంట్స్ తెరిచిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ట్విట్టర్ లో 500కె మిలియన్ ఫాలోవర్ల మైలు రాయిని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, నేడు ఒక సరదా ట్వీట్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ‘తాను నేను… కాలం మారినా, దేశం మారినా’ అంటూ 1990లలో, అలానే ప్రస్తుతం 2020 లాక్ డౌన్ సమయంలో తాను వంట చేస్తూ,
తన సతీమణి సురేఖ ప్రక్కన తనకు సాయం అందిస్తూ ఉన్న రెండు ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. కాగా వాటిని ట్విట్టర్ అకౌంట్ లో టాగ్ చేసిన చిరు, కాలం మారినా కొన్ని మారవు అంటూ పోస్ట్ చేశారు. కాగా మెగాస్టార్ పోస్ట్ చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాలలో ఎంతో వైరల్ అవుతోంది….!!!