దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న లేటెస్ట్ భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర లో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, రామ్ చరణ్ అల్లూరి ఫస్ట్ లుక్ వీడియో యూట్యూబ్ లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసి, సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచాయి.
ఇకపోతే ఎల్లుండి, అనగా మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీం పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ వీడియో గురించి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ప్రస్తుతం లాక్ డౌన్ ని ప్రభుత్వం మరిన్ని రోజులు పొడిగించిన విషయం అందరికీ తెలిసిందే, కావున ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో ని సిద్ధం చేయడం వీలు కాలేదని, అందువలన ప్రేక్షకులు, ఎన్టీఆర్ అభిమానులు అర్ధం చేసుకోవాలని వారు కోరడం జరిగింది. అలానే లాక్ డౌన్ అనంతరం మంచి అకేషన్ చూసుకుని తప్పకుండా కొమరం భీం ఫస్ట్ లుక్ ని మీ ముందుకు తెస్తాం అని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ తమ ప్రకటన లో తెల్పడం జరిగింది….!!