మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ వీడియో : భీం పరిచయం చేసిన రామరాజు

0
924

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రౌద్రం రణం రుధిరం’. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కొమరం భీంగా నటిస్తున్న ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో ఒక వీడియో ని  యూట్యూబ్ లో కాసేపటి క్రితం రిలీజ్ చేయడం జరిగింది.

‘ఆడు కనపడితే నిప్పుకణం నిలబడినట్లుంటాది, కలబడితే ఏగు సుక్క ఎగబడినట్లుంటాది’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో మొదలైన అల్లూరిగా నటిస్తున్న రామ్ చరణ్ ఇంట్రడక్షన్ అదిరిపోయింది అనే చెప్పాలి. ‘ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదారి, నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’ వంటి డైలాగ్స్ తో పాటు వీడియో లో రామ్ చరణ్ అత్యద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అత్యద్భుతం అనే చెప్పాలి. ఇక నేడు కాసేపటి క్రితం రిలీజ్ అయిన ఈ వీడియోకు మెగా, నందమూరి ఫ్యాన్స్ తో సహా సినీ ప్రేక్షకాభిమానులందరి నుండి మంచి స్పందన లభిస్తోంది. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here