ప్రజల పట్ల సేవాభావంతో వ్యవహరిస్తున్న శుభశ్రీ గారికి నా సెల్యూట్ : మెగాస్టార్ చిరంజీవి…..!!

0
684
Megastar Salutes the woman who cares for people

ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో మిగతా ఇతర దేశాలతో పాటు మన దేశంలో కూడా కొన్ని వారాలుగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రజలకు అన్ని విధాలుగా రక్షణనందిస్తూ ఎందరో పోలీసులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి తమ వృత్తిని నిర్వర్తిస్తున్నారు. కాగా ఒడిశాకు చెందిన మహిళా పోలీసు అధికారిణి శుభశ్రీ, ఇటీవల తన డ్యూటీ నిర్వహిస్తున్న సందర్భంగా ఒక రోడ్ ప్రక్కన ఉన్న మానసిక వికలాంగురాలిని చూసి చలించిపోయి, ఆమెకు భోజనం అందించడంతో పాటు స్వయంగా తానే దగ్గరుండి ఆమెకు తినిపించడం జరిగింది. కాగా ఆమె చేసిన ఆ గొప్ప పని తాలూకు వీడియో మూడు రోజులుగా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అయింది. అయితే ఆ వీడియోని మొన్నటి మాతృ దినోత్సవం రోజున చూసిన మెగాస్టార్, ఆమె మానవత్వంతో చేసిన ఆ గొప్ప పనికి ఎంతో చలించి పోయారు. అనంతరం శుభశ్రీ తో ఆ ఘటనపై ప్రత్యేకంగా వీడియో కాల్ ద్వారా మాట్లాడిన మెగాస్టార్, కాసేపటి క్రితం దానిని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

శుభశ్రీ తో మాట్లాడిన మెగాస్టార్ ఆమెతో  “మిమ్మల్ని చూస్తుంటే నిజంగా మా అందరికీ ఎంతో గర్వంగా ఉంది, మానవత్వంతో మీరు వ్యవహరించిన తీరుకు నిజంగా నా సెల్యూట్” అంటూ మెగాస్టార్ ఆమెతో అన్నారు. అయితే తాను డ్యూటీలో భాగంగా ఒక రోడ్డు ప్రక్కగా వెళ్తున్న సమయంలో ఆమె కనపడిందని, మానసికంగానే కాక శారీరకంగా కూడా ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటోంది అని గ్రహించి, తాను ఆమెకు భోజనం తినిపించానని శుభశ్రీ అన్నారు. మెగాస్టార్ గా ఎంతో గొప్ప పేరు గడించిన మీరు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు తాను చూసానని, మీవంటి వారు ఎందరికో ఆదర్శం అని శుభశ్రీ, మెగాస్టార్ పై అభినందనలు కురిపించారు. కాగా మెగాస్టార్ పోస్ట్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here