దయచేసి నా పుట్టినరోజు వేడుకలు జరుపకండి : ఎనర్జిటిక్ హీరో రామ్

0
1135
Hero Ram's Appeal To His Fans

గత ఏడాది డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, ప్రస్తుతం లేటెస్ట్ మూవీ ‘రెడ్’ లో హీరోగా నటిస్తున్నారు. ఇక ప్రతి ఏడాది తన పుట్టినరోజుని ఎంతో వైభవంగా జరిపే అభిమానులు, ఈ ఏడాది మాత్రం జరుపవద్దని కోరుతూ కాసేపటి క్రితం ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేసారు.

ఎన్నో ఏళ్లుగా తనను, తన సినిమాలను ప్రేమిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పిన రామ్, కొన్నాళ్లుగా కరోనా వ్యాధి కారణంగా మన దేశంలోని ప్రజలందరినీ సామజిక దూరం పాటించేలా లాక్ డౌన్ చేసినందున, ఇటువంటి సమయంలో అభిమానులు తన పుట్టినరోజు వేడుకలను జరుపకుండా ఎవరి ఇళ్లలో వారు ఉంటే బాగుంటుందని, అదే తనకు ఇచ్చే నిజమైన పుట్టినరోజు బహుమతి అని రామ్ తన పోస్ట్ లో కోరుతూ తెలిపారు….!!!

Hero Ram's Appeal To His Fans

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here