సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘అన్నాథే’ రిలీజ్ డేట్ ఖరారు……!!

0
758
Superstar Rajinikanth Annadhe Release date conformed

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘అన్నాథే’. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ని జరుపుకుంది. ఇక కొన్నాళ్లుగా మన దేశంలో కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ అమలవుతుండడంతో, ఈ సినిమాకు సంబందించిన విజువల్ ఎఫెక్ట్స్ మరియు ఇతర వర్క్ ని నడిపిస్తున్న సినిమా యూనిట్, తమ సినిమాని రాబోయే 2021వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో అధికారికంగా ప్రకటించడం జరిగింది.

రజినీకాంత్ ఒక పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, నయనతార తో పాటూ మీనా, కుష్బూ సుందర్, ప్రకాష్ రాజ్, సూరి, తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డి ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు వెట్రి ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. తమ హీరో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్  సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు…..!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here