నేటితో సక్సెస్ఫుల్ గా 15 ఏళ్ళ సినీ కెరీర్ పూర్తి చేసుకున్న మాస్ చిత్రాల దర్శకులు ‘బోయపాటి శ్రీను’…..!!

0
1189
Bhadra Movie completes 15 years

సరిగ్గా 15ఏళ్ళ క్రితం నేటి రోజున మాస్ రాజా రవితేజ, బ్యూటిఫుల్ హీరోయిన్ మీరా జాస్మిన్ ల కలయికలో దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ‘భద్ర’ సినిమా ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు బోయపాటి శ్రీను. కాగా దర్శకుడిగా ఫస్ట్ మూవీ తోనే బెస్ట్ హిట్ కొట్టిన బోయపాటి, ఆ తరువాత విక్టరీ వెంకటేష్ తో తులసి, నటసింహ బాలయ్యతో సింహా, లెజెండ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దమ్ము, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సరైనోడు, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో జయ జానకి నాయక, అలానే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలు చేసి తన 15 ఏళ్ళ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్ అందుకుని, ప్రస్తుతం బాలయ్యతో ముచ్చటగా మూడవ సినిమా చేస్తున్నారు బోయపాటి.

ఒక్కో సినిమాతో దర్శకులుగా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ ముందుకు సాగుతున్న బోయపాటికి నేడు పలువురు సినిమా ప్రముఖులు, అభిమానులు 15 ఏళ్ళ సక్సెస్ఫుల్ సినీ కెరీర్ పూర్తి అయిన సందర్భంగా శుభాభినందనలు తెలియచేస్తున్నారు. మొదటి సినిమా భద్ర నుండి ప్రస్తుతం బాలయ్య తో చేస్తున్న లేటెస్ట్ సినిమా వరకు తనతో పని చేసిన ప్రతి ఒక్కనటీనటులకు, టెక్నీషియన్లను తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని, వారు అందరూ కలిసి తనకు సహకరించినందువల్లనే తాను ఇంత మంచి చిత్రాలు తీయగలిగానని, అలానే ఈ 15 ఏళ్ళ నుండి తెలుగు ప్రేక్షకులు తనపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలు మరువలేనివని బోయపాటి ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు…..!!!

Bhadra Movie completes 15 years

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here