దయచేసి సినిమా థియేటర్లకు అనుమతి ఇవ్వండి – నర్రా శివనాగు, డైరెక్టర్

0
649
Director Narra Sivanagu Request govt to open Movie Theaters

ఈ కరోనా కల్లోలం వల్ల విధించబడిన లాక్ డౌన్ ప్రభావం సినీ పరిశ్రమ మీద ఎక్కువగా ఉంది. కొత్త సినిమాల షూటింగ్ నిలిపి వేత, థియేటర్లలో ఆగిపోయిన సినిమాల ప్రదర్శన, విడుదలకి సిద్ధమై థియేటర్ల కోసం ఎదురు చూస్తున్న సినిమాలు.. సినీ పరిశ్రమని నమ్మకుని ఉన్న లక్షలాది మందిని అతలాకుతలం చేస్తున్నాయి.

మా అన్నపూర్ణమ్మ గారి మనవడు సినిమాతో పాటు, కోట్లు ఖర్చు పెట్టి నిర్మించబడిన ఎన్నో సినిమాలు థియేటర్లలో విడుదల కోసం ఎదురుచూస్తున్నాయి.

పలు పరిశ్రమలు ఉత్పత్తిని తిరిగి ప్రారంభించాయి. వైన్ షాపులు తెరుచుకున్నాయి.

ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి చేస్తున్న వినతి.. వీలయినంత త్వరగా సినిమా థియేటర్‌లు తెరవడానికి అనుమతి ఇవ్వండి. ఒక హాల్లో600 కెపాసిటీ ఉన్న చోట 300 మందిని కూర్చోనివ్వండి. ఈ విధంగా సోషల్ డిస్టెన్స్ పాటించడానికి అవకాశం ఇవ్వండి. నిర్మాతలు కూడా సినిమా ఒక టిక్కెట్ కొన్న వారికి ఒక మాస్క్ ఉచితంగా పంపిణీ చేయటకు అవసరమైన ఖర్చును భరించండి.

ఈ విధంగా చేయటం వల్ల సినిమా వ్యాపారం మళ్లీ పుంజుకుంటుంది. ప్రజలు బయటకు రావడం, సినిమాలు చూడటం మళ్లీ మొదలవుతుంది.

ఇది వ్యక్తిగతంగా నా అభిప్రాయం, విన్నపం మాత్రమే. అందరినీ ఏకీభవించమని అనటం లేదు. సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం, సినిమా పరిశ్రమ మీద ఆధారపడిన వారి సంక్షేమం కోసం వీలయినంత త్వరగా సినిమా థియేటర్లకు అనుమతి ఇవ్వమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను

నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు)
ఫిల్మ్ డైరెక్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here