ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ని మీ కొత్త చిత్రాలన్నీ యువ దర్శకులతో నే ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి అని అడిగినప్పుడు,
“సాహో సుజీత్ తో లూసిఫర్ చేసే ఆలోచన ఉంది. బాబీ డైరెక్టర్ గా ఒక సినిమా, మెహర్ రమేష్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. రీసెంట్ గా హరీష్ శంకర్, సుకుమార్, పరశురామ్ లాంటి యువదర్శకులను మా ఇంట్లోనే కలవడం, డిస్కస్ చేసుకోవడం జరిగింది. కొరటాల శివ గారి సినిమా పూర్తయ్యాక నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ గురించి చెప్తాను. యంగ్ డైరెక్టర్స్ తో చేస్తే నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవచ్చు. అలాగే నన్ను స్క్రీన్ మీద చూస్తూ పెరిగి డైరెక్టర్స్ అయిన యంగ్ జనరేషన్ కి నన్ను కొత్తగా ప్రజెంట్ చేయాలన్న తపన ఉంటుంది. నాకు కూడా వాళ్ళతో, వాళ్ళ న్యూ థాట్స్ తో వర్క్ చేయడం ఇన్స్పైరింగ్ గా ఉంటుంది.” అని చెప్పారు మెగాస్టార్.