యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఛాలెంజ్ స్వీకరించిన కొరటాల శివ…..!!

0
779
Director Koratala Siva Accepted NTR Challenge

ప్రస్తుతం మన దేశం మొత్తం లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అన్ని కూడా బంద్ కావడంతో సినిమా రంగానికి చెందిన వారు కూడా ఎక్కడికక్కడ ఇళ్లలో ఉండిపోయి తమ ఫ్యామిలీ లతో సరదాగా గడుపుతున్నారు. ఇకపోతే ఈ లాక్ డౌన్ వేళ తమ ఇంట్లోని వారికి వీలైనంలో సాయపడుతూ ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ద్వారా తమ ఇంటి పనులు చేస్తూ, నిన్న ఆ వీడియో తో పాటు అదే ఛాలెంజ్ ని దర్శక దిగ్గజం రాజమౌళికి విసిరారు అర్జున్ రెడ్డి దర్శకుడైన సందీప్ రెడ్డి వంగా.

కాగా ఆయన ఛాలెంజ్ ని సాదరంగా స్వీకరించిన రాజమౌళి, దానిని పూర్తి చేసి, ఆపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి, దర్శకుడు సుకుమార్, నిర్మాత శోభు యార్లగడ్డ లకు విసిరారు. దానితో నిన్న రాజమౌళి ఛాలెంజ్ ని స్వీకరించిన ఎన్టీఆర్, నేడు దానిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి, తన బాబాయి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, మరియు దర్శకుడు కొరటాల శివ లకు ఛాలెంజ్ విసరగా, నేడు కాసేపటి క్రితం ఎన్టీఆర్ ఛాలెంజ్ ని సాదరంగా స్వీకరిస్తున్నాను, కానీ ఈ నెల రోజుల పాటు పని చేసిన వీడియో ఫుటేజ్ మిస్ అయింది అంటూ కొరటాల ఒకింత సరదాగా ట్వీట్ చేయడం జరిగింది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here