కరోనా మనకు ఎంతో నేర్పింది, ఎంత కష్టమైనా సరే వారికి సాయమందిస్తూనే ఉంటాము : మెగాస్టార్ చిరంజీవి….!!

0
611
కరోనా మనకు ఎంతో నేర్పింది ఎంత కష్టమైనా సరే వారికి సాయమందిస్తూనే ఉంటాము : మెగాస్టార్ చిరంజీవి....!!

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటినీ కుదిపేస్తున్న మహమ్మారి కరోనా దెబ్బకు మన దేశాన్ని కూడా రాబోయే మే 3వ తేదీ వరకు పూర్తిగా లాక్ డౌన్ చేయడం జరిగింది. దీనివలన ఇంటి నుండి బయటకు రాలేక, పనులు లేక, ఎందరో పేద, దిగువ వర్గాల వారు నానా అవస్థలు పడుతున్నారు. అయితే అటువంటి వారిని ఆదుకోవడానికి పలు రంగాల నుండి కొందరు మంచి మనసుతో ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు. ఇకపోతే మన టాలీవుడ్ నుండి కూడా ఇప్పటికే కొందరు ప్రముఖులు తమ శక్తి కొలది విరాళాలు అందించగా, ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కరోనా విపత్తు నిధి పేరిట ఒక సంస్థను ప్రారంభించి విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే కొందరు సినీ నటులు ముందుకు వచ్చి తమకు వీలైన సాయాన్ని ఆ నిధికి అందించడం జరిగింది. కాగా ఆ విరాళాల ద్వారా ముఖ్యంగా సినిమా పరిశ్రమలోని వేలాదిమంది రోజువారీ కార్మికులకు నిత్యావరసాలు, ఆహారపదార్ధాలు అందచేస్తున్నరు.

ఇక కాసేపటి క్రితం ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మెగాస్టార్ మాట్లాడుతూ, ఈ కరోనా మనకు ఎంతో నేర్పిందని, ఇప్పటివరకు పెద్దగా ఇంటి పనులు చేయనివారు సైతం, ఇటీవల కొద్దిరోజులుగా తమ ఇంట్లోని ఆడవారికి సాయం అందిస్తూ హ్యాపీగా ఉంటున్నారని, దీనివలన ఒకరకంగా కుటుంబసభ్యుల మధ్య అనుబంధం పెరిగిందని అన్నారు. ఇక ఈ మహమ్మారిని ఎవరి ఇంట్లో వారు ఉండి గట్టిగా పోరాటం చేద్దాం, అతి త్వరలోనే దీనిని మన దేశం నుండి తరిమి కొడదాం అంటూ మెగాస్టార్ పిలుపునిచ్చారు. ఇక తాను ఏర్పాటు చేసిన కరోనా విపత్తు నిధికి ఎందరో ముందుకు వచ్చి తమ సాయాన్ని అందిస్తుండడం సంతోషంగా ఉందని, ఎంత కష్టమైనా సరే, ఈ లాక్ డౌన్ పూర్తిగా ముగిసే వరకు సినీ కార్మికులకు నిత్యావసరాలు అందిస్తూనే ఉంటాం అని, ఇటువంటి విపత్కర సమయంలో వారిని ఆదుకోవడం మన అందరి బాధ్యత అని మెగాస్టార్ అన్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here