పూరి జగన్నాథ్ గారికి కృతజ్ఞతలు…..’బద్రి’ నాకు మంచి గుర్తింపునిచ్చింది : రేణు దేశాయ్….!!

0
842
Renu desai About Badri Movie Memories

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘బద్రి’ నేటితో సక్సెస్ఫుల్ గా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు అభిమానులు, ప్రేక్షకులు ఆ సినిమా యూనిట్ కి పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు. దర్శకుడిగా పూరి జగన్నాథ్ డెబ్యూ మూవీ అయిన బద్రి అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఇకపోతే నేడు ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్, తనను ఈ సినిమాలో వెన్నెల క్యారెక్టర్ కు సెలెక్ట్ చేసినందుకు దర్శకుడు పూరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలానే ఆ సినిమా షూటింగ్ సమయంలో హీరో పవన్ కళ్యాణ్ తో కలిసి సరదాగా దిగిన రెండు ఫోటోలను తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన రేణు, ఆ సినిమా షూటింగ్ ఎంతో సరదాగా సాగిపోయింది, హీరో పవన్ గారు, నేను సినిమాని ఎంతో ఎంజాయ్ చేస్తూ నటించామని, నటిగా తనకు మంచి గుర్తింపునిచ్చిన ఆ సినిమా అనుభవాలు తాను ఎప్పటికీ మరువలేనని ఆమె అన్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here