టాలీవుడ్లో వరుస అద్భుత విజయాలతో ఏస్ డైరెక్టర్ గా పేరుగాంచిన ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌద్రం రణం రుధిరం’. స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియోని కొమరం భీం గా నటిస్తున్న ఎన్టీఆర్ తో రిలీజ్ చేయించింది సినిమా యూనిట్. ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ వీడియోకి విశేషమైన స్పందన లభించింది. ఇకపోతే ఈ సినిమా కథ యొక్క కీలకమైన మెయిన్ థీమ్ ని రాజమౌళి వెల్లడించడం జరిగింది.
నీరు, అగ్ని అనేవి రెండూ ఒకదానిని మరొకటి నాశనం చేయగల విభిన్నమైన శక్తివంతమైన స్వభావం కలవి, అదే ఒకవేళ అవి రెండూ కూడా కలిసినట్లైతే, యావత్ ప్రపంచం మొత్తాన్ని ఒక మోటార్ మాదిరిగా ముందుకు నడిపించగలవు అంటూ రాజమౌళి చెప్పారు. కాగా ఆయన వెల్లడించిన ఈ థీమ్ ని కాసేపటి క్రితం ఈ సినిమా నిర్మాతలైన డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసారు. అందుకే ముందుగా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్లో హీరోలిద్దరిలో ఒకరిని అగ్నిగా, మరొకరిని నేరుగా చూపించి, చివర్లో ఇద్దరూ చేతులు కలుపుతున్న విధంగా చూపించినట్లు తెలుస్తోంది. కాగా అదే ఈ సినిమా మెయిన్ థీమ్ అని తెలియడంతో ఈ సినిమాని రాజమౌళి ఎంత అద్భుతంగా తీసి ఉంటారా అని ప్రేక్షకుల్లో, అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగిందని చెప్పవచ్చు…..!!