కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే : మెగాస్టార్ చిరంజీవి…!!

0
774
Megastar About all the mothers

ప్రస్తుతం కరోనా వ్యాధి ఎఫెక్ట్ తో కొన్నాళ్లపాటు ప్రజలు ఎక్కడికక్కడ తమ ఇళ్లలోనే ఉండాలని మన దేశాన్ని కూడా లాకౌట్ చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇక కరోనా సోకకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ మొహానికి మాస్క్ కట్టుకోవడంతో పాటు రోజులో వీలైనన్ని ఎక్కువసార్లు చేతులను సబ్బు లేదా శానిటైజర్ లతో కానీ శుభ్రం చేసుకోవాలని, అలానే దగ్గు, తుమ్ము వచ్చినపుడు మోచేతివరకు చేతిని గట్టిగా అడ్డుపెట్టుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక ఇటువంటి పరిస్థితుల్లో బయట మాస్కులకు కొరత ఏర్పడడంతో కొందరు ప్రముఖులు వాటిని స్వయంగా ఎవరికి వారు ఇంట్లోనే తాయారు చేసుకోవచ్చని కొన్ని పద్దతులను వివరిస్తున్నారు కూడా.

మెగాస్టార్ చిరంజీవి తల్లి గారైన శ్రీమతి అంజనాదేవి, కొందరు తన సహచర మహిళలతో కలిసి దాదాపుగా 700 మాస్కులవరకు కుట్టి సమాజంపట్ల, దేశం పట్ల తనవంతు బాధ్యతతో ముందుకు వచ్చారని నిన్నటి నుండి ఆమె ఫోటో ఒకటి పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతుండడంతో పలువురు ప్రజలు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా కాసేపటి క్రితం ఆ వార్త పై ఆమె తనయుడు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. వాస్తవానికి నిన్నటి నుండి మీడియా మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న ఆ ఫొటోలో ఉన్నది తన తల్లి అంజనమ్మ కాదని, అయితేనేమి తన దయాగుణంతో ఇంత మంచి పని చేస్తున్న కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే కదా, ఆమెకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు అంటూ మెగాస్టార్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా వివరణ ఇస్తూ ఒక పోస్ట్ చేసారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here