ప్రస్తుతం కరోనా వ్యాధి మరింతగా ప్రభలకుండా మన దేశాన్ని 21 రోజులపాటు లాకౌట్ చేస్తున్నట్లు ఇటీవల మన ప్రధాని మోడీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయతే ఈ లాకౌట్ వలన పేద వర్గాల ప్రజలు ఆర్ధికంగా సమస్యలు ఎదుర్కోవడంతో పాటు, మరికొందరికైతే కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విషయమై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఆర్ధిక ప్యాకెజి ప్రకటించినప్పటికీ, మేము కూడా ప్రజలకు తమ వంతుగా సాయం అందిస్తాం అంటూ పలు రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు రావడం జరిగింది.
ఇక మన టాలీవుడ్ సినిమా పరిశ్రమ వారు కూడా ముందుకొచ్చి విరాళాలు అందివ్వగా సూపర్ స్టార్ మహేష్ బాబు విశాఖపట్నం సిటీ వైడ్ ఫాన్స్ ఆధ్వర్యంలో స్థానిక సరస్వతి పార్క్ ప్రాంతంలో గల కేజీహెచ్ హాస్పిటల్ లో పలువురు రోగులకు నిత్యావసర సరుకులు, ఆహారపదార్ధాలు పంచిపెట్టడం జరిగింది. కాగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన ఆ గొప్ప పని తాలూకు వీడియోని సరిలేరు నీకెవ్వరు నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర, మహేష్ ఫ్యాన్స్ ఈ విధంగా ప్రజలకు సేవ చేయడంలోనూ మంచి ట్రెండ్ సృష్టిస్తున్నారు అంటూ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడం జరిగింది. కాగా ప్రస్తుతం ఆ వీడియో పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది….!!
Vishaka Mahesh Fans setting a good trend for serving the society. pic.twitter.com/91Oa5MQ8sx
— Anil Sunkara (@AnilSunkara1) April 11, 2020