రోజు వారి ఫిలిం వర్కర్స్ కు మెగాస్టార్ రూ.1 కోటి విరాళం….!!

0
2837
Chiranjeevi donated 1 crore

తీవ్రంగా ప్రభలుతున్న కరోనా వ్యాధి తీవ్రతను కట్టడి చేసేందుకు పలు దేశాలతో పాటు మన దేశంలో కూడా ఏకంగా 21 రోజుల పాటు లాకౌట్ ప్రకటిస్తున్నట్లు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. దానితో మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు, ముఖ్యంగా రోజువారీ వేతనాల ప్రకారం పని చేసే వారికి పనులు లేక పూట గడవడం కూడా కష్టం అవుతోంది.  అయితే ఇప్పటికే ఈ విషయం గ్రహించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి కొంత మొత్తాన్ని, అలానే రేషన్ సరుకులను అందించాలని నిర్ణయించాయి. మరోవైపు ఈ కరోనా మహమ్మారి వలన టాలీవుడ్ లో కూడా పనులు లేక ఇబ్బందులు పడుతున్న రోజువారీ వర్కర్స్ ని ఆదుకునేందుకు పలువురు సినిమా ప్రముఖులు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి రోజు వారి వర్కర్స్ కు 1 కోటి విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

కాసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి తన వంతుగా రోజు వారి వర్కర్స్ కు  ఆదుకునేందుకు రూ.1 కోటి విరాళం గా ప్రకటిస్తున్నట్లు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలిపారు. ఇటుంవటి క్లిష్ట పరిస్థితుల్లో దిగువ తరగతి ఆదాయవర్గాల ప్రజలను ఆదుకోవడం మన బాధ్యత అని, అవకాశం ఉన్న వారు కూడా తమవంతుగా సాయమందించి ముందుకు రావాలని మెగాస్టార్ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here