యూత్ స్టార్ నితిన్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితం అయిన తాజా సినిమా భీష్మ, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ ని సంపాదించిన విషయం తెలిసిందే. సేంద్రియ వ్యవసాయం అనే కాన్సెప్ట్ తో పలు రకాల కమర్షియల్ హంగులు జోడించి దర్శకుడు వెంకీ అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకుని ప్రేక్షకులు నీరాజనాలు పొందింది.
నితిన్ వండర్ఫుల్ పెర్ఫార్మన్స్, హీరోయిన్ రష్మిక అందం, అభినయం, మహతి స్వరసాగర్ అందించిన సాంగ్స్, సాయి శ్రీరామ్ అందించిన అదిరిపోయే విజువల్స్ ఈ సినిమాకు మరింత ఆకర్షణ తీసుకువచ్చాయి. ఇక నిన్నటి తో ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని అందుకున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. కాగా ఈ సినిమా సక్సెస్ వేడుకని రేపు సాయంత్రం విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రం లో ఎంతో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు….!!