యువ కథనాయకుడు నాగశౌర్య హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం 4గా కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మహేష్ ఎస్.కోనేరు నిర్మిస్తున్న కొత్త చిత్రం శుక్రవారం ఉదయం రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా హీరో కల్యాణ్ రామ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకులు హరీష్ శంకర్, వి.ఐ.ఆనంద్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం హీరో కల్యాణ్ రామ్ స్క్రిప్ట్‌ను దర్శకుడు కె.పి.రాజేంద్రకి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో..
నిర్మాత మహేష్ ఎస్. కోనేరు మాట్లాడుతూ – ‘నాగశౌర్య గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ గా ఉండబోతుందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. మా దర్శకుడు రాజా మంచి ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ ని రెడీ చేశారు. మార్చిలో షూటింగ్ ప్రారంభించి ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం. హీరో కళ్యాణ్ రామ్ గారికి, దిల్ రాజు గారికి, హరీష్ శంకర్ గారికి విచ్చేసిన ఇతర సినిమా పెద్దలకు, మీడియా వారికి థ్యాంక్స్.’ అన్నారు.
దర్శకుడు కె.పి.రాజేంద్ర మాట్లాడుతూ – ‘ప్రారంభోత్సవానికి విచ్చేసిన కళ్యాణ్ రామ్ గారికి, దిల్ రాజు గారికి, హరీష్ శంకర్ గారికి థ్యాంక్స్. మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ సినిమాలో సరికొత్త నాగశౌర్యని చూస్తారు. మార్చిలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి’ అన్నారు.
యువ కథనాయకుడు నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి..
సినిమాటోగ్రఫి: సమీర్ రెడ్డి,
ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్,
సంగీతం: సాగర్ మహాతి,
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె,
నిర్మాత: మహేశ్ ఎస్. కోనేరు,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.పి.రాజేంద్ర.