హానెస్ట్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కిన ‘హిట్’ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది – నిర్మాత నాని

0
1091

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమాదాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `హిట్‌`. `ది ఫ‌స్ట్ కేస్‌` ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. విశ్వ‌క్ సేన్ ఈ చిత్రంలో విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 28న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో…

నిర్మాత ప్ర‌శాంతి త్రిపిర్‌నేని మాట్లాడుతూ – ‘‘సినిమా మా అంద‌రికీ న‌చ్చింది. డెఫ‌నెట్‌గా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌నే భావిస్తున్నాం’’ అన్నారు.

హీరోయిన్ రుహానీ మాట్లాడుతూ – ‘‘చాలా సంతోషంగా ఉంది.. అలాగే ఎగ్జ‌యిటెడ్‌గా కూడా ఉన్నాను. సినిమా కోసం అంద‌రం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ఫిబ్ర‌వరి 28న విడుద‌ల‌య్యే సినిమాను చూసి పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

హీరో విశ్వ‌క్ సేన్ మాట్లాడుతూ – ‘‘ఫిబ్రవరి 28న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 24 గంటలు కూడా లేవు. అయినా సరే మా అందరి మొహల్లో చిరునవ్వు ఉందంటే ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’’ అన్నారు.

నిర్మాత నాని మాట్లాడుతూ – ‘‘రేపు(ఫిబ్రవరి 28న) సినిమా విడుదలవుతుంది. చాలా హ్యాపీగా, కాన్ఫిెడెంట్‌గా ఉన్నాం. ప్రేక్ష‌కుల రెస్పాన్స్ కోసం ఆతృత‌గా వెయిట్ చేస్తున్నాం. అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది. గ‌త రెండు మూడేళ్లుగా తెలుగులో కొత్త కంటెంట్ సినిమాలు అన్నీ స‌క్సెస్ అవుతున్నాయి. స‌పోర్ట్ చేస్తున్న అంద‌రికీ థాంక్స్‌. అన్ని చోట్ల నుండి పాజిటివ్ బ‌జ్ వ‌స్తుంది. ప్రామిస్‌గా చెబుతున్నాను సినిమా న‌చ్చి.. మ‌ళ్లీ మీ స్నేహితుల‌తో, ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తోనో వెళ‌తారనే న‌మ్మ‌కం ఉంది. సినిమాను చూసిన వారు సినిమా గురించి ఎక్కువగా రివీల్ చేయకుండా చూడాలని నిర్మాతగా చెబుతున్నాను. శైలేష్ క‌థ న‌చ్చ‌డంతో నిర్మాత‌గా మారాను. అంద‌రం క‌లిసి విశ్వ‌క్ అయితే ఈ సినిమాకు న్యాయం చేస్తాడ‌ని భావించాం. హిట్ అంటే హోమిసైడ్ ఇంట‌ర్వెన్ష‌న్ టీమ్ అని అర్థం. అంటే ఓ ప్ర‌మాదం జ‌రుగబోతుంద‌ని ముందే ఊహించి దాన్ని జ‌ర‌గ్గ‌కుండా చూసే టీమ్. ఈ సినిమా స్నీక్ పీక్‌ను చాలా మంది రెస్పాన్స్ వ‌చ్చింది. మా బ్యాన‌ర్‌లో కంటెంట్‌కు ప్రాధాన్య‌త ఉన్న సినిమాల‌నే నిర్మిస్తాం. కొత్త కాన్సెప్ట్‌, టాలెంటెను ఎంక‌రేజ్ చేయ‌డానికే ఈ బ్యాన‌ర్‌ను పెట్టాను. ఇందులో స్టార్ డైరెక్ట‌ర్స్ సినిమాలు చేయ‌రు. అలాగే నేను కూడా నా బ్యాన‌ర్‌లో న‌టించ‌ను. నాకు క‌థ న‌చ్చి నేను చేయ‌లేని సినిమాల‌ను నా బ్యాన‌ర్‌లో నిర్మిస్తాను. ఇది వ‌ర‌కు మా బ్యాన‌ర్‌లో కొత్త‌గా చేసిన అ! సినిమాకు నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈసారి మ‌రో కొత్త జోన‌ర్‌తో మీ ముందుకు వ‌స్తున్నాం. నేను ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు సార్లు సినిమా చూశాను. ఒక‌సారి కూడా బోర్ కొట్ట‌లేదు. పిబ్ర‌వ‌రి 28.. ఈ సినిమాకు ఫ‌ర్ట్‌ఫెక్ట్ రిలీజ్ అనిపించింది. రేపు రాజ‌మౌళిగారు కూడా సినిమాను చూడ‌బోతున్నారు. నిర్మాత ప్ర‌శాంతిగారు మా ఫ్యామిలీ మెంబ‌ర్‌. చాలా టాలెంటెడ్. ఆమె లాంటి వ్య‌క్తులు.. మంచి టీమ్ ఉండ‌బ‌ట్టే నేను సినిమాల్లో న‌టిస్తూ.. సినిమాల‌ను నిర్మించ‌గ‌లిగాను’’ అన్నారు.

డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను మాట్లాడుతూ – ‘‘శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుక వ‌స్తోన్న హిట్ ఓ హానెస్ట్ థ్రిల్ల‌ర్‌. మీ అంద‌రి స‌పోర్ట్ కావాలి. నిర్మాత‌గా నానిగారు క‌థకు ఏద‌వ‌స‌ర‌మో దాన్ని అందించారు. 49 రోజుల పాటు షూటింగ్ చేశాం. మా అంద‌రి క‌ష్టానికి త‌గిన ఫ‌లితం ద‌క్కుతుంద‌ని భావిస్తున్నాం’’ అన్నారు.

‘‘ మీ లాంటి హీరోలు సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తూ కూడా సినిమాల‌ను నిర్మిస్తే.. మాలాంటి నిర్మాత‌ల ప‌రిస్థితేంటి?’’
నాని దిల్‌రాజు అడిగిన ప్ర‌శ్న‌కు నాని స‌మాధానం ఇస్తూ.. మ‌ళ్లీ ఆ సినిమాల‌ను కూడా తెచ్చి మీ చేతుల్లోనే పెడుతున్నాం క‌దా సార్‌! అని చ‌మత్క‌రించారు నాని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here