మారో సినిమా పూర్తి చేసిన ధనుష్..

0
216
Dhanush

కోలీవుడ్ లో డిఫరెంట్ కథలతో ఆడియెన్స్ ని తనవైపుకు తిప్పుకునే హీరో ధనుష్. రీసెంట్ గా అసురన్ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న ధనుష్ మరో మాస్ కథతో రెడీ అవుతున్నాడు. యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ధనుష్ 40వ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫైనల్ గా సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ ప్రాజెక్ట్ పై ఆడియెన్స్ లో పాజిటివ్ బజ్ నెలకొంది.

ఇప్పటికే ధనుష్ కి సంబందించిన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ధనుష్ 40వ సినిమా కోర మీసాలతో మాస్ ఆడియెన్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక డిఫరెంట్ మాస్ హీరోగా ధనుష్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అసురన్ సినిమా ధనుష్ కెరీర్ కి మంచి సక్సెస్ ఇవ్వడమే కాకుండా అతని మార్కెట్ కూడా పెంచింది. దీంతో ధనుష్ 40వ సినిమా భారీగా విడుదలయ్యే అవకాశం ఉంది. షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ ధనుష్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here