మరో బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్న ప్రామిసింగ్ హీరో

0
7160
Good Newzz

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రివ్యూలతో సంబంధం లేకుండా సక్సెస్ అందుకోవడం అక్షయ్ కుమార్ కి అలవాటే. ప్రామిసింగ్ హీరోగా ఒక బ్రాండ్ సెట్ చేసుకున్నాడు. టాక్ ఎలా వైరల్ అయినా కలెక్షన్స్ తో షాకిస్తుంటాడు. రీసెంట్ గా విడుదలైన ‘గుడ్ న్యూస్’ సినిమా మంచి ఓపెనింగ్స్ తో అక్షయ్ కెరీర్ కి మరో బూస్ట్ ఇచ్చింది. సినిమాకు సంబందించిన వీకెండ్ కలెక్షన్స్ బాలీవుడ్ ఎనలిస్ట్ లకు పెద్ద షాక్ ఇచ్చింది.

గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గుడ్ న్యూస్’ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది.  కృత్రిమ గర్భధారణ కాన్సెప్ట్ తో ఇద్దరు జంటల విషయంలో జరిగిన మెడికల్ మిస్టేక్ ఆధారంగా కథ మంచి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇక మొదటిరోజు 17.56 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు (శనివారం) 21.78 కోట్లను అందుకుంది. ఇక ఆదివారం కలెక్షన్స్ తో మొత్తంగా 64.99కోట్లతో ఈ సినిమా చిత్ర యూనిట్ కి నిజంగానే గుడ్ న్యూస్ అందించింది. ఇటీవల కాలంలో అక్షయ్ కుమార్ ఓపెనింగ్స్ తోనే షాకిస్తున్నాడు. మినిమమ్ 100కోట్లు అనే విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో లాభాల్ని అందిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here