‘మత్తు వదలరా’ కి రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశంసలు

0
767

రాజమౌళి ఫ్యామిలీ నుంచి మరో జనరేషన్ కూడా ఆడియెన్స్ ని డిఫరెంట్ గా ఎట్రాక్ట్ చేసింది. ‘మత్తు వదలరా; అంటూ ఆడియెన్స్ ని వినూత్నంగా టైటిల్ తోనే ఆకట్టుకున్న చిత్ర యూనిట్ ఫైనల్ గా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎమ్ఎమ్.కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా తెరకెక్కిన మత్తు వదలరా సినిమాకు మరో కుమారుడు కాల భైరవ సంగీతాన్ని అందించాడు. ఇక సినిమాను వీక్షించిన సినీ తారలు చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ ‘మత్తు వదలరా’ సినిమా చూసి యూనిట్ పై ప్రశంసలు కురిపించారు.

రెబల్ స్టార్ ప్రభాస్ ‘మత్తు వదలరా’ సినిమా ప్రశంసలు పై చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా ఆడియెన్స్ కి ఈ విషయాన్నీ ఆనందంగా తెలిపింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన మత్తు వదలరా సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. థియేటర్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. ఫైనల్ గా కీరవాణి తనయులు బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకోవడమే కాకుండా స్టార్ హీరోల నుంచి మంచి ప్రశంసలు కూడా అందుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here