‘ఊల్లాల ఊల్లాల’ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న వైవిధ్యమైన పాత్ర చేశాను – హీరో నటరాజ్

0
1466

సుఖీభవ మూవీస్ పతాకంపై ఎ.గురురాజ్ నిర్మాతగా సీనియర్ నటుడు సత్యప్రకాష్ ని దర్శకునిగా పరిచయం చేస్తూ నటరాజ్, నూరిన్, అంకిత హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. కొత్త కథ, కథనాలతో జనవరి 1న ‘ఊల్లాల ఊల్లాల’ ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సందర్భంగా హీరో నటరాజ్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
– ఎలాగైనా సినీ పరిశ్రమలో పెద్ద దర్శకుడిగా ఎదగాలనుకొనే యువకుడిగా నా పాత్ర ఉంటుంది. అలాగే డబ్బు మీద కూడా బాగా వ్యామోహం ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు కలిగిన ఒక అబ్బాయికి మరో వైపు ఒక ప్రేమకథ కూడా ఉంటుంది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న వైవిధ్యమైన రోల్ నాది.
 
టైటిల్ డిఫరెంట్ గా ఉంది?
– అనేక హిట్ పాటలలో ఉల్లాలా ఉల్లాల అనేది ఒక ఊతపదం. సినిమా మొత్తం స్క్రిప్ట్ సిద్ధం చేశాక..ఏమి టైటిల్ పెట్టాలని ఆలోచించినప్పుడు ఈ ఉల్లాల ఉల్లాల అనే టైటిల్ బాగుంటుందని అలోచించి పెట్టడం జరిగింది.
 
తెలుగులో మొదటి సినిమా కదా! ఎలా ఫీల్ అవుతున్నారు?
– చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. నాన్న తెలుగులో అనేక చిత్రాలలో నటించి తానేమిటో నిరూపించుకున్నారు. అందుకే మూవీ రిసల్ట్ కోసం ఎదురు చూస్తున్నాను.
 
ఈ చిత్రానికి మీ నాన్న దర్శకుడు కదా! సెట్స్ లో మీ రిలేషన్ ఎలా ఉండేది?
– ఫ్యామిలీ సెంటిమెంట్స్ , రిలేషన్స్ సెట్స్ లో ఉండవు. రిలేషన్స్ వేరు ప్రొఫెషన్ వేరు అనేది నా నమ్మకం. ఆయనలో నాకు బాగా నచ్చిన అంశాలు ఫంక్చువాలిటీ మరియు డిసిప్లిన్ . కొన్ని సార్లు ఆయనే స్వయంగా నటించి చూపించే వారు. ఆయన నాకు చాలా విషయాలు నేర్పారు.
 
హీరో గానే చేస్తారా లేక విలన్ పాత్రలు కూడా చేస్తారా?
– ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నేను హీరోగా కాదు ఒక మంచి నటుడు కావాలనుకుంటున్నాను. తెలుగులో మంచి పాత్ర చేసే అవకాశం వస్తే విలన్ గా చేయడానికైనా సిద్ధం.
 
మొదటి సినిమా కదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
– గతంలో నేను వంద కేజీలకు పైగా బరువు ఉండేవాడిని హీరో కావడం కోసం బరువు తగ్గాను. డాన్స్, హార్స్ రైడింగ్, జిమ్నాస్టిక్స్ వంటివి నేర్చుకున్నాను.

ఏమైనా కొత్త సినిమాలు చేస్తున్నారా?
అమ్మ దీవెన అనే ఓ చిత్రంలో నటిస్తున్నాను. ఆ చిత్రం దాదాపు పూర్తయింది. ఫిబ్రవరి లేదా మార్చి లో విడుదల అవుతుంది. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్స్ తో తెరకెక్కే మరో చిత్రంలో నటించే అవకాశం కలదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here