విడుదల తేదీ : డిసెంబర్ 28, 2019
బ్యానర్: శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్
నటీనటులు : సుడిగాలి సుధీర్, ధన్యా బాలకృష్ణ, ఇంద్రజ, పోసాని, నాజర్, షాయాజీ షిండే, పృథ్వి, శివ ప్రసాద్, గద్దర్ తదితరులు..
సంగీతం : భీమ్స్
సినిమాటోగ్రాఫర్ : సి. రాంప్రసాద్
ఎడిటర్: గౌతమ్ రాజు
నిర్మాత : కె. శేఖర్ రాజు
దర్శకత్వం: రాజశేఖర్ రెడ్డి పులిచర్ల
‘జబర్దస్త్, ఢీ, పోవే పోరా’ వంటి సూపర్‌హిట్ టెలివిజన్ షోస్ ద్వారా ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా, ‘రాజుగారి గది’ ఫేమ్ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ బేనర్‌పై ప్రొడక్షన్ నెం:1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్ రాజు నిర్మించిన చిత్రం ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హీరోగా తొలి ప్రయత్నం చేస్తున్న సుధీర్, ప్రచార కార్యక్రమాల్లో సినిమా సక్సెస్ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించారు. టీజర్, ట్రైలర్‌లు కూడా ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
కథ:
సుధీర్ (సుడిగాలి సుధీర్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. పెళ్లి కావడం లేదని తన పేరు చందుగా మార్చుకుంటాడు. ఈ క్రమంలోనే తన సహ ఉద్యోగి (ధన్య బాలకృష్ణ) పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. వారి ఎంగేజ్మెంట్ తరువాత కొన్ని అనుకోని సంఘటనల నేపథ్యంలో స్వాతి సలహా మేరకు ఓ స్వామిజీని సుధీర్ కలుస్తాడు. దాంతో జాతకం చూపిస్తే ఆయనపై శని ప్రభావం ఉందని స్వామిజీ చెప్పడంతో ఓ యాగం చేస్తాడు. ఆ స్వామిజీ చందు ద్వారా అతని తండ్రి (సాయాజీ షిండే) పనిచేసే మంత్రి (శివ ప్రసాద్) నుండి వెయ్యి కోట్లు కొట్టేస్తారు. ఆ స్వామిజి ఎవరు? ఆ డబ్బు ఎవరిది? అసలు ఆ 1000 కోట్ల స్కామ్‌ను హీరో ఎలా చేధించాడు అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
నటీనటుల పెర్ఫామెన్స్:
బుల్లితెర మీదబాగాపాపులర్ అయిన సుడిగాలి సుధీర్ వెండితెరమీదహీరోగాచాలాఎనర్జిటిక్ గా కనిపించాడు. ముఖ్యంగా తన డాన్స్ లతో విశేషంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో తన కామెడీ, డ్యాన్స్, ఎమోషన్, యాక్షన్ ఇలా అన్ని విభాగాల్లో తన టాలెంట్ చూపించాడు. సుధీర్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. హీరోయిన్ ధన్యా బాలకృష్ణ భిన్న షేడ్స్ ఉన్న పాత్రలో తన నటనతో ఆకట్టుకుంటుంది. పాటలలో గ్లామరస్ గా కనిపించింది. రావుగారి పాత్రలో నిర్మాత శేఖర్ రాజు మంచి నటనను కనబరిచారు. డైలాగ్ డెలివరీ విషయంలో ఆయన టైమింగ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో కథలో వచ్చే రెండు ట్విస్ట్‌లు ఆడియన్స్ కి థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి.. హీరో తల్లి దండ్రులుగా చేసిన షాయాజీ షిండే, ఇంద్రజ తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. మంత్రి గా శివ ప్రసాద్, హీరో మావయ్యగా పోసాని ఆకట్టుకుంటారు. చివరలో గద్దర్ తన ఆట, పాటతో సినిమాని మరో రేంజ్ కి తీసుకెళ్లారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
కామెడీ ప్రధానంగా సాగిన ఈ చిత్రానికి భీమ్స్ మ్యూజిక్, రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ లో భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. రాంప్రసాద్ మరోసారి తన కెమెరాతో మ్యాజిక్ చేశారు. ప్రతి లొకేషన్ ను అందంగా చూపించారు. గౌతమ్ రాజు ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. ఆయన అనుభవం సినిమాకి ఎంతో ఉపయోగపడింది. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ థియేటర్లో ఆడియన్స్ చేత విజిల్స్ వేయించేలా ఉన్నాయి. దర్శకుడు రాజశేఖర్ పులిచర్ల కథ, స్క్రీన్ ప్లే బాగుంది. రైమింగ్తో కూడిన పంచ్ లు సినిమాకి మంచి అసెట్. శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ ప్రొడక్షన్ వేల్యూస్ చాలా బాగున్నాయి. మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.
మొత్తంగా చెప్పాలంటే సాఫ్ట్ వేర్ సుధీర్ పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక సోసియో ఫాంటసీ చిత్రం చూస్తున్నాం అని ఫీలైన ప్రేక్షకుడికి విరామం తరువాత దర్శకుడు ఓ క్రైమ్ స్టోరీని పరిచయం చేశాడు దర్శకుడు. మొదటి సినిమాకే, పొసాని, నాజర్, షాయాజీ షిండే, శివ ప్రసాద్, ఇంద్రజ లాంటి సీనియర్ నటీనటులను డైరెక్ట్ చేసే అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు దర్శకుడు రాజశేఖర్ రెడ్డి. నిర్మాతగా శేఖర్ రాజు మొదటి సినిమా అయినా రామ్ ప్రసాద్, గౌతమ్ రాజు, రామ్ లక్ష్మణ్ లాంటి సీనియర్ టెక్నీషియన్స్ తో నిర్మించడం అభినందించాల్సిన విషయం. ఇన్నాళ్లు బుల్లితెర మీద తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునే సుధీర్ హీరోగా మరెన్నో సినిమాలు చేసి అలరించాలని ఆశిద్దాం.
బోటమ్ లైన్: ఆకట్టుకునే డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
రేటింగ్: 3/5