మేకింగ్‌ వీడియోలో సత్యప్రకాష్‌ టాలెంట్‌ చూసి ఆశ్చర్యపోయా..ఈ సినిమా ద్వారా గురురాజ్‌కు పెద్ద‌ సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నా- ‘ఊల్లాల.. ఊల్లాల’ ఆడియో వేడుకలో సెన్సేష‌న‌ల్ డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ

0
898

నటుడు సత్యప్రకాష్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఊల్లాల..ఊల్లాల’. ఆయన కొడుకు నటరాజ్‌ కథానాయకుడు. గురురాజ్‌ నిర్మాత. ఊల్లాల..ఊల్లాల ఆడియో ఆవిష్కరణ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఆదిత్య మ్యూజిక్‌ద్వారా ఆడియో విడుదలయింది. మొదటి పాటను తెలంగాణ ఫిలింఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ ఆవిష్కరించారు. రెండో సాంగ్‌ను ప్రింట్‌ మీడియా, వెబ్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు ఆవిష్కరించారు. సెన్సేష‌న‌ల్ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ బిగ్‌ సీడీని ఆవిష్కరించారు.

సెన్సేష‌న‌ల్ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ.. ”మేకింగ్‌ వీడియోలో సత్యప్రకాష్‌ను చూసి ఆశ్చర్యపోయా. తనలో ఇంత టాలెంట్‌ వుందా అనిపించింది. ఇక నాయికగా నటించిన అంకిత బాగా డాన్స్‌ చేసింది. ఈ చిత్ర నిర్మాత గురురాజ్‌కు సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నా“అన్నారు.

తెలంగాణ ఫిలింఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ.. ”సినిమా చూశాను. చాలా బాగుంది. ప్రతీ సన్నివేశాన్ని అద్భుతంగా మలిచారు. అన్ని హంగులతో ప్రేమ, యాక్షన్‌, కామెడీ, హార్రర్‌ అంశాలతో తీశారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా” అన్నారు.

నిర్మాత సి. కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ”రెగ్యులర్‌ ప్రొఫెషన్‌ నుంచి రూటుమారి దర్శకుడు అయ్యాడు సత్యప్రకాష్‌. కొత్తవారితో తీయడమంటే కొన్ని ఆర్థిక సమస్యలుంటాయి. కానీ గురురాజ్‌ సినిమాకు విడుదలచేస్తాడనే భరోసానే సత్యప్రకాష్‌ను నడిపించింది. ఇక రాము రావడం ఈ చిత్రానికి ఎనర్జీ. ఈ సినిమా గురించి వర్మ ట్వీట్‌ చేయాలి“ అన్నారు.

రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ఆర్‌జీవి రాకతోనే చిత్రం 50 శాతం సక్సెస్‌ అయినట్లే“అన్నారు.

ప్రముఖ నిర్మాత, నటుడు అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ.. ”మిత్రుడు సత్యప్రకాష్‌ కోసమే వచ్చాను. నేను బెనర్జీ, సత్య.. క్లోజ్‌ ఫ్రెండ్స్‌. నేను ఈ సినిమాలో ఓ సినిమా నిర్మాతగా నటించా. జనరల్‌గా నెగెటివ్‌ రోల్స్‌ వేసిన వారిని జనాలు తిట్టుకుంటారు. కానీ వారు బయట చాలా సున్నితమైన మసస్కులు. అలాంటివారిలో సత్య ప్రకాష్‌ ఒకరు” అన్నారు.

చిత్ర దర్శకుడు సత్యప్రకాష్‌ మాట్లాడుతూ.. ”జనవరి 1న సినిమా విడుదల చేస్తున్నాం. మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తున్నా. ఈ సినిమాను నిర్మించి విడుదలకు తీసుకు వచ్చిన గురురాజ్‌కు ధన్యవాదాలు. ఆయనతో జర్నీ చాలా ఆనందంగా వుంది. ప్రతి సన్నివేశాన్ని ఇద్దరం చర్చించుకుని తెరకెక్కించాం. అదేవిధంగా సినిమాకు ఏ టైటిల్‌ పెడదామని చర్చించుకుంటుండగా సడన్‌గా ఆయన మదిలో మెదిలిన ఆలోచనతో టైటిల్‌ దొరికిందంటూ.. ‘ఊల్లాల..ఊల్లాల’ అని పాడుకుంటూ వచ్చారు. ఈ టైటిల్‌ చిత్ర యూనిట్‌కూ నచ్చింది. వర్మగారు కూడా బాగుందన్నారు. వర్మగారు రావడానికి గురురాజ్‌, రామకృష్ణ గౌడ్‌లే కారణం. అలాగే ఈ చిత్రానికి నాతోపాటు జర్నీ చేసిన డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అన్నారు.

నిర్మాత గురురాజ్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతీ టెక్నీషియన్‌కూ, నటీనటులకు ధన్యవాదాలు తెలియజేశారు. సుఖీభవ వెంచర్‌ సోదరలకూ ధన్యవాదాలు“ అన్నారు.

శివాజీరాజా మాట్లాడుతూ.. ”రామసత్యనారాయణ నా దృష్టిలో రామానాయుడులాండివాడు. మా భీమవరం పేరుతో టాకీస్‌ పెట్టి సినిమాలు తీస్తున్నాడు. అలాగే సత్యప్రకాష్‌ మాతోపాటు 35 ఏళ్ళనాడే కెరీర్‌ మొదలుపెట్టాడు. సత్య వేసిన పాత్రలకూ, పర్సనల్‌ క్యారెక్టర్‌కూ సంబంధమేలేదు. మంచి వ్యక్తిత్వం వున్న వ్యక్తి. గురురాజ్‌ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా”అన్నారు.

గీత రచయిత కాసర్ల శ్యామ్‌ మాట్లాడుతూ.. ”ఈ చిత్రంలో ‘రామ్‌రామ్‌..’ అనే పాటను రాశాను. దాన్ని మంగ్లీ, రోల్‌రైడా పాడారు. కాంటెంపరరీ ఇష్యూతో టైటిల్‌ వచ్చేలా పాటను రాశాను. సంగీత దర్శకుడు జాయ్‌ చిన్నవాడైనా మంచి బాణీలు ఇచ్చాడు” అని పేర్కొన్నారు.

గాయని మంగ్లీ మాట్లాడుతూ ”సత్యప్రకాష్‌ను విలన్‌గా చూశాను. కానీ బయట చాలా మంచివ్యక్తి. నిర్మాత గురురాజ్‌గారు నాతో మొదటిసారి ర్యాప్‌ పాట పాడించారు. ఆ తర్వాత నటించమన్నారు. అనుకోకుండా రెండు చేశాను” అన్నారు.

సంగీత దర్శకుడు జాయ్‌ మాట్లాడుతూ… ”గీతామాధురి, అశ్విని, మంగ్లీతోపాటు సంగీతానికి సహకరించిన బ్యాక్‌గ్రౌండ్‌ టీంకు థ్యాంక్స్‌. అందరి కృషితో సినిమా పాటలు బాగా వచ్చాయి. ఆడియో బాగా వచ్చింది. ఇది రొమాంటిక్‌ కామెడీ థ్రిల్లర్‌ జోనర్‌. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇవ్వడానికి మంచి అవకాశం కల్గింది. ఇందుకు దర్శకుడు సత్యప్రకాష్‌ ముందుండి నడిపారు” అని తెలిపారు. హీరో నటరాజ్‌ మాట్లాడుతూ.. ”జాయ్‌.. బీట్‌ సాంగ్స్‌తో కిరాక్‌ పుట్టించాడు. మంగ్లీ, రోల్‌ రైడా అద్భుతంగా పాడారు” అన్నారు.

గీత రచయిత వెంకట్‌ మాట్లాడుతూ.. ”పాటకు తగిన సంగీతాన్ని అందించిన జాయ్‌గారికి ధన్యవాదాలు. ఇందులో ‘తికమకలు మకతికలుగా’ వుండే ఓ పాటను రాశాను. ఆ పాటకు లెక్క ఉంది.. ఇలాంటి తికమకలు ఎన్నో వున్న సినిమా ఇది” అన్నారు.

పృథ్వీ మాట్లాడుతూ.. ”కథ చాలా బాగుంది. విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసిన దర్శకుడు సత్య ప్రకాష్‌ తన కోణంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను బాగా తీశాడు” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here