పూర్తిగా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ టార్గెట్ చేసి తీసిన సినిమా `తెనాలి రామ‌కృష్ణ `బిఎ.బిఎల్ ` – దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి

0
1209

యంగ్ హీరో సందీప్ కిష‌న్, హన్సిక జంటగా జి.నాగేశ్వ‌ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న మూవీ `తెనాలి రామ‌కృష్ణ `బిఎ.బిఎల్ `.`కేసులు ఇవ్వండి ప్లీజ్‌` ట్యాగ్ లైన్‌. వరలక్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో పోసాని, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్య త‌దిత‌రులు న‌టిస్తున్నారు. జ‌వ్వాజి రామాంజ‌న‌యులు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎన్‌.ఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్, ఇందుమూరి శ్రీనివాసులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం న‌వంబ‌ర్ 15న గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి ఇంటర్వ్యూ…

సినిమా గురించి?
– ఈ మధ్య కాలంలో ప్రేక్షకులని పూర్తిగా నవ్వించే సినిమాలు తగ్గాయి. రకరకాల టెన్షన్స్ వల్ల ప్రతి ఒక్కరం ఎక్కువ ప్రెజర్ తీసుకుంటున్నాం. నవ్వడం కూడా చాలా తగ్గించేసాం. అయితే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. గతం లో నరేష్ గారు, రాజేంద్రప్రసాద్ లాంటి వారు పూర్తి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్స్ చేసి ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించేవారు. అయితే ఇప్పుడు నవ్వడం తగ్గడం వల్లే లాఫింగ్ క్లబ్స్ వచ్చాయి అని నేను నమ్ముతాను. అలా లాఫింగ్ క్లబ్స్ కి వెళ్ళి నవ్వాల్సిన పరిస్థితిని కొద్దో గొప్పో తగ్గించే శక్తి సినిమాకు ఉంది. అందులోనే నేను ఫన్ బాగా తీయగలను అని నా నమ్మకం. గతంలో వచ్చిన నా సినిమాలు అది ప్రూవ్ చేశాయి. పూర్తిగా నవ్వుల్నీ టార్గెట్ చేసి తీసిన సినిమా ఇది. ఫ్యామిలీ మొత్తం వచ్చి హిలేరియస్ గా నవ్వుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది.

తెనాలి రామకృష్ణ అని టైటిల్ పెట్టడానికి కారణం?
– ఈ సినిమాలో సందీప్ కిషన్ ది తిమ్మిని బమ్మి చేసే లాయర్ క్యారెక్టర్. శ్రీకృష్ణ దేవరాయ ఆస్థానంలో పనిచేసే తెనాలి రామకృష్ణ ది కూడా అలాంటి క్యారెక్టర్. శ్రీ కృష్ణ దేవరాయ ని ఎవరైనా చంపడానికి ట్రై చేస్తే మాత్రం చాలా సీరియస్ గా దానినుండి ఆయన్ను కాపాడతాడు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ లో కూడా తాను ప్రేమించే వ్యక్తిని చంపడానికి ట్రై చేస్తే ఎలా కాపాడాడు? అనేది కీల‌కం. దాంతో ఆ టైటిల్ ఫైనలైజ్ చేశాం.

సందీప్ కిషన్ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది?
– అసలు కాంప్రమైజ్ ఐతే కేసులు, గొడవలు, కోర్ట్ లు ఉండవు అనే ధోరణిలో ఉండే హీరో, ఒక కేసు విషయంలో నో కాంప్రమైజ్ అన్న స్థితికి చేరుతాడు. అలాంటి రెండు షేడ్స్ కలిగిన హీరో పాత్రని కామిక్ గా తెరకెక్కించడం జరిగింది. గత చిత్రాలకు భిన్నమైన మాస్ కూడా ఇమేజ్ సందీప్ కిషన్ కి ఈ చిత్రంతో వస్తుంది అనుకుంటున్నాను.

హన్సిక క్యారెక్ట‌ర్ ?
– నేనే మహా మేధావిని అనుకొనే ఇన్నోసెంట్ లాయర్ గా హన్సిక పాత్ర ఉంటుంది. ఆమెకు అంతా తెలుసు అనుకుంటుంది కానీ ఏమీ రాని క్యారెక్ట‌ర్‌లో హన్సిక చాలా బాగా చేసింది. అలాగే సందీప్ కిష‌న్, హన్సిక ల కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్ల‌స్ అవుతుంది.

వరలక్ష్మీ శ‌ర‌త్‌కుమార్ పాత్ర ఎలా ఉండ‌బోతుంది?
– ఆమెది ఈ చిత్రంలో కీలకమైన పాత్ర. భారీ ఇమేజ్ ఉన్న ఆమె చేత ప్రాధాన్యం లేని పాత్ర చేయిస్తే సినిమాకి నెగెటివ్ మార్క్స్ పడే అవ‌కాశం ఉంది. అందుకే ఆమెను ప్రాధాన్యం ఉన్న ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం తీసుకోవడం జరిగింది. ఈ మూవీ చూసిన తరువాత ఆడియ‌న్స్ తో పాటు ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.

చిత్రీకరణ స‌మ‌యంలో సందీప్ కి గాయం అయింది క‌దా?
– అవును ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు బస్సు లో నుండి రౌడీలు అద్దాలు పగులగొట్టుకొని బయటకి రావాలి. ఆ సీన్ తీస్తున్నప్పుడు ఓ గాజు ముక్క సందీప్ కి గుచ్చుకోవడం జరిగింది. దానితో రెండు నెలలు షూటింగ్ వాయిదాపడింది.

ఈ సినిమాలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు క‌దా! వారి గురించి?
– ఈ మూవీలో కమెడియన్స్ గా నటించిన పోసాని, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్య కృష్ణల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. దొంగ సాక్ష్యాలు చెప్పేదిగా సత్య కృష్ణ కుటుంబం, ఏళ్ల నుండి కోర్ట్ చుట్టూ తిరిగే వాడిగా సప్తగిరి, ఒక పెద్ద క్రైమ్ లో సాక్షులుగా వెన్నల కిషోర్ మరియు అన్నపూర్ణమ్మ ఫ్యామిలీ కనిపిస్తారు. వీరి కామెడీ ట్రాక్ తెనాలి రామకృష్ణ పాత్రకు మించి ఉంటుంది.

ప్రొడ్యూసర్స్ గురించి?
– ప్రొడ్యూసర్స్ నా స్నేహితులు, వారు కథను, నన్ను నమ్మి ఈ సినిమా నిర్మించడం జరిగింది. వారికి ఇండస్ట్రీ కొత్త అయినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి అవుట్ ఫుట్ రావడానికి నాకు ఎంతో సహకరించారు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి వారికి నిర్మాతలుగా మంచి పేరు, డబ్బు రావాలని కోరుకుంటున్నా. అంటూ ఇంటర్వ్యూ ముగించారు దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here