హాలీవుడ్ అనిమేషన్ మూవీ కి డబ్బింగ్ చెప్పనున్న ఘట్టమనేని సితార

0
742

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతుల ముద్దల కూతరు సితార ఘట్టమనేని, ఇటీవల దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి, చిన్నవయసులోనే మంచి పేరుతో సక్సెస్ఫుల్ గా ముందుకు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కాబోతున్న హాలీవుడ్ భారీ యానిమేటెడ్ మూవీ ఫ్రోజెన్-2 తెలుగు వర్షన్ లోని బేబీ ‘ఎల్సా’ పాత్రకు సితార తన వాయిస్ ని అందించనుంది.

ఈ విషయాన్ని ప్రఖ్యాత డిస్నీ సంస్థ వారు కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే తన ఆకట్టుకునే టాలెంట్ తో మంచి పేరు సంపాదించిన సితార, తొలిసారి ఒక హాలీవుడ్ మూవీకి వాయిస్ ఓవర్ అందిస్తుండడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆనందంతో తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆమెకు శుభాభినందనలు తెలియచేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here