కుటుంబ బంధాల విలువను తెలియజేసే చిత్రం ‘తోలుబొమ్మలాట’ – నటుడు దేవిప్రసాద్

0
599
Devi Prasad

డా. రాజేంద్రప్రసాద్‌, విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా, శ్రీనివాస్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘తోలుబొమ్మలాట’. సుమదుర్గా క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య మాగంటి సమర్పణలో దుర్గాప్రసాద్‌ మాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వనాథ్‌ మాగంటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. పల్లెటూరి నేపథ్యంలో నడిచే ఆహ్లదకరమైన కథగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈసంధర్భంగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేసిన నటుడు మరియు దర్శకుడు దేవి ప్రసాద్ ఇంటర్వ్యూ.

తోలు బొమ్మలాట మూవీ గురించి చెప్పండి?
– తోలుబొమ్మలాట ఒక కుటుంబం, బంధాల మధ్య నడిచే ఫ్యామిలీ ఎంటర్టైనర్ . మనుషులలోని మంచి చెడులను, వాటి వలన కుటుంబంలో ఏర్పడే సమస్యల ఇతివృత్తం గా తెరకెక్కింది. పల్లెటూరి నేపథ్యంలో నడిచే ఆహ్లదకరమైన ప్రేమ కథ ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది.

దర్శకుడు విశ్వనాథ్ మాగంటి తో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది?
– దర్శకుడు విశ్వనాధ్ మాగంటి చాలా కూల్ గా ఉంటారు. ఎవరైనా ఒక నూతన దర్శకుడు లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ లేదా యాక్షన్ చిత్రాలతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు, కానీ విశ్వనాధ్ దానికి భిన్నంగా ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని ఎంచుకున్నారు. తాను తీసిన సినిమా చూసి నలుగురు మంచి సినిమా చూశాం అని మెచ్చుకుంటే చాలు అనుకొనే తత్త్వం కల కుర్రాడు. దర్శకుడిగా అంత మంది సీనియర్ నటులను చక్కగా హ్యాండిల్ చేశారు.

రాజేంద్ర ప్రసాద్ తో చేసిన అనుభవం ఎలా ఉంది?
– రాజేంద్ర ప్రసాద్ గారితో చేయాలని ఎప్పటి నుండో నాకు కోరిక ఉండేది. అది ఈచిత్రంతో నెరవేరింది. ఆయన ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. అలాగే ఈ చిత్రంలో చాలా మంది సీనియర్ నటులు ఉన్నారు. వారందరితో కలిసి చేసిన ప్రయాణంలో నాకు తెలియని అనేక విషయాలు నేర్చుకున్నాను.

మీరు కూడా దర్శకుడు కదా, దర్శకుడికి సలహాలు ఏమైనా ఇచ్చారా?
– లేదండీ. ఎందుకంటే అనేక సినిమాలు చేసిన ఒక సినియర్ దర్శకుడికి కూడా మరొక దర్శకుడు చేసే సినిమా గురించి వారికంటే ఎక్కువ తెలియదు. ఒక నటుడిగా మనం నటిస్తున్నప్పుడు ఆదర్శకుడి దగ్గరికి తెల్ల కాగితంలా వెళ్ళాలి, దర్శకుడికి నచ్చినది దానిపై రాసుకుంటాడు.

తోలు బొమ్మలాట చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
– ఒక విలేజ్ లో పెద్దాయన కొడుకు పాత్ర నాది. కెరీర్ కోసం పట్నం వెళ్లి అక్కడే స్థిరపడిన వ్యక్తిలా కనిపిస్తాను. అలాగే మనం, మన సంపాదన, భవిష్యత్తు అని అనే నేటి తరం ఆలోచనా ధోరణి ఉంటుంది. అలాగని స్వార్ధం కూడుకున్న నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కాదు. సాధారణంగా అన్ని కుటుంబాలలో కనిపించే సహజమైన స్వభావం కలిగి ఉంటుంది.

నటుడిగానే కంటిన్యూ అవుతారా? లేక దర్శకత్వం కూడా చేస్తారా?
– మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి కాబట్టి నటుడిగా చేస్తున్నాను. దర్శకత్వంలో ఇదొక యాంగిల్ కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాను. అయితే కచ్చితంగా త్వరలోనే నా దర్శకత్వంలో ఒక సినిమా తీస్తాను. ఒక మంచి సినిమా తీసిపెద్ద హిట్ కొట్టాలని కసిగా ఉన్నాను.

నటుడిగా ప్రస్తుతం ఏఏ చిత్రాల్లో నటిస్తున్నారు?
– శర్వానంద్ శ్రీకారం చిత్రంలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే ‘కాదల్’ అని ఒక సినిమా, ‘ఆయుష్మాన్ భవ’, ‘సాఫ్ట్ వేర్ సుధీర్’, ’22 ‘ , ‘మీటూ’ వీటితో పాటు ఇంకా పేరుపెట్టని మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here