రఘుపతి వెంకయ్య నాయుడు ట్రైలర్ లాంచ్ చేయనున్న మహేష్ బాబు

0
733

తెలుగు సినిమా అభ్యున్నతికి విశేష సేవలు అందించిన పితామహుడు రఘుపతి వెంకయ్య గారి జీవితం ఆధారంగా అదే పేరుతో తెరకెక్కిన తాజా సినిమా ‘రఘుపతి వెంకయ్య నాయుడు’. ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్ పై యువ దర్శకుడు బాబ్జి తెరకెక్కించిన ఈ సినిమాలోని ప్రధాన పాత్రను సీనియర్ నటులు నరేష్ పోషించగా, తణికెళ్ల భరణి, మహర్షి, వాహిని, సత్య ప్రియ, భావన, శక్తిమాన్‌, అఖిల్‌ సన్నీ, మునిచంద్ర, సాయికాంత్‌, చాణక్య, దేవరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

ఈ సినిమా అధికారిక థియేట్రికల్ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు, నేటి మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చిత్రీకరించామని అంటోంది సినిమా యూనిట్. శ్రీ వెంకట్‌ సంగీతం అందించిన ఈ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…. !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here