బాలీవుడ్ లో ఇప్పుడు ఆయుష్మాన్ ఖురానా హవా నడుస్తోంది. చేసిన ప్రతి సినిమా డిఫరెంట్ గా ఉండటమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద అతని మార్కెట్ కూడా పెరుగుతోంది. బుల్లితెర నుంచి వెండితెర వరకు కష్టపడి పైకొచ్చిన ఆయుష్మాన్ గత మూడేళ్ళుగా వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ తో జనాలని ఆకర్షిస్తున్నాడు.
మొన్న ‘డ్రీమ్ గర్ల్’ తో సాలిడ్ సక్సెస్ అందుకున్న ఈ డైనమిక్ ఈ హీరో ఇప్పుడు ‘బాలా’ సినిమాతో మంచి ఓపెనింగ్స్ అందుకున్నాడు. బట్టతల కారణంగా ఎదురయ్యే సమస్యలు, దాన్ని కవర్ చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు ఈ సినిమాలో మెయిన్ హైలెట్ పాయింట్స్ఒక బట్టతల కాన్సెప్ట్ తో ఆయుష్మాన్ ఆడియెన్స్ ని ఎంతగా ఆకర్షించాడో మొదటిరోజు వచ్చిన కలెక్షన్స్ ని చుస్తే అర్ధమవుతుంది.
ఫస్ట్ డే బాలా సినిమా 10.15కోట్ల వసూళ్లతో ఆయుష్మాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో వచ్చిన డ్రీమ్ గర్ల్ లో ఆయుష్మాన్ అమ్మాయిగా కనిపించి 150 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు బాలా సినిమాతో మరో కొత్త పాయింట్ ని ప్రజెంట్ చేస్తూ అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకుంటున్నాడు.