నితిన్ ‘భీష్మ’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్….!!

1
807
యంగ్ స్టార్ నితిన్ హీరోగా ఇటీవల ఛలో సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భీష్మ. సింగిల్ ఫరెవర్ అనే ఉప శీర్షికతో వైవిధ్యమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇటీవల దీపావళి సందర్భంగా రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది.
ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ని ఈనెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందితున్న ఈ సినిమాకు సాయిశ్రీరాం ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here