కమాండో – 3′ మూవీ కోసం మార్షల్ ఆర్ట్స్ తో అదరగొడుతున్న ఆదా శర్మ.

0
505
బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా కమాండో 3. ఇదివరకు కమాండో సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు మంచి సక్సెస్ అవగా, వాటిని మించేలా దర్శకుడు ఆదిత్యదత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సిరీస్ లోని రెండవ భాగంలో భావన రెడ్డి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన అందాల భామ ఆదా శర్మ, ఈ మూడవ భాగంలో కూడా అదే పాత్రలో నటిస్తున్నారు.
ఇకపోతే తన క్యారెక్టర్ కోసం ఎంతో కష్టపడి నేర్చుకున్న భారతీయ మార్షల్ ఆర్ట్స్ విద్య సిలంబం తాలూకు వీడియోను ఆదా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు. ‘తమకు సెక్యూరిటీగా దేశి బాడీగార్డ్ కావలసిన వారు వెంటనే రిజిస్టర్ చేసుకోండి, ఎందుకంటే ఈనెల 29వ తేదీన కమెండో 3 రిలీజ్ తరువాత భావనా రెడ్డి ఫుల్ బిజీ’ అంటూ ఆమె సరదాగా ఈ పోస్ట్ చేయడం జరిగింది. కాగా ఈ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here