ఎమోషన్ తో కూడిన యాక్షన్ డ్రామాగా ‘తిప్పరామీసం’ ఆడియన్స్ ని అలరిస్తుంది – దర్శకుడు కృష్ణ విజయ్‌.ఎల్

0
1287

‘అసుర’లాంటి విభిన్నతరహా చిత్రాన్నితెరకెక్కించి మొదటి సినిమాతోనే దర్శకుడిగా, నిర్మాతగా సూపర్‌హిట్‌ అందుకున్నారు కృష్ణ విజయ్‌.ఎల్ . ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో శ్రీవిష్ణు, నిక్కితంబోలి హీరోహీరోయిన్లుగా శ్రీ హోమ్‌ సినిమాస్‌ సమర్పణలో రిజ్వాన్‌ ఎంటర్టైన్మెంట్స్‌, కృష్ణ విజయ్‌.ఎల్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై యువ నిర్మాత రిజ్వాన్‌ నిర్మించిన చిత్రం ‘తిప్పరా మీసం’. నవంబర్‌ 8న వరల్డ్‌వైడ్‌గా గ్లోబల్‌ సినిమాస్‌ ద్వారా గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతోన్న సందర్భంగా దర్శకుడు కృష్ణ విజయ్‌.ఎల్ ఇంటర్వ్యూ..

ఒక దర్శకుడిగా, నిర్మాతగా మీ ప్రయాణం ఎలాస్టార్ట్ అయింది?
– నాకు చిన్నప్పటి నుండి ఆర్ట్స్‌లో ఎక్కువ ఇంట్రెస్ట్‌ ఉండేది. ఎల్‌అండ్‌టి కంపెనీలో ఆర్కిటెక్ట్‌గా జాబ్‌ చేసే వాడిని. అయితే యూఎస్‌ వెళ్ళడం ఇష్టం లేక కొత్తగా ఏదయినా చేద్దాం అనుకొని ఇండస్ట్రీకి వచ్చాను. అలా ‘ప్రస్థానం’ సినిమాకి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా చేశాను. క్రియేటివ్‌ యాస్పెక్ట్స్‌లో ఇంట్రెస్ట్‌ ఉండడం వల్ల కంటెంట్‌ నచ్చి ‘అసుర’ సినిమాని డైరెక్ట్‌ చేశాను. ఆ తర్వాత సాగర్‌ చంద్ర చెప్పిన స్టోరీ నచ్చి ‘అప్పట్లో ఒకడుండేవాడు’, అదేవిధంగా ‘నీది నాది ఒకే కథ’ సినిమాలకి నిర్మాతగా వ్యవహరించాను. ఆ సినిమా రిలీజ్‌ తర్వాత వెంటనే ‘తిప్పరా మీసం’ స్టార్ట్‌ చేశాం.

‘తిప్పరా మీసం’ టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?
– బేసిక్‌గా ఇండియా పాకిస్థాన్‌ మీద క్రికెట్‌ మ్యాచ్‌ గెలిస్తే మనకు ఒక ప్రైడ్‌ మూమెంట్‌ లాంటిది. బోర్డర్‌లో ఆర్మీ మన శత్రువుల మీద గెలిస్తే కూడా అది ఒక గ్రేట్‌ మూమెంట్‌. అలాగే ప్రతిఇంట్లో ప్రతికుర్రాడికి చిన్నచిన్న ప్రైడ్‌ మూమెంట్స్‌ ఉంటాయి. అలా ఒకఇంట్లో ఒకకుర్రాడికి ఏ పని చేస్తే ‘తిప్పరా మీసం’ అనే ప్రైడ్‌ మూమెంట్‌ వచ్చింది అనేది ఈ సినిమా కథ. ఇదొక యాక్షన్‌ డ్రామా.

ప్రీ రిలీజ్‌లో మదర్‌ సెంటిమెంట్‌తో ఉండే చిత్రం అని శ్రీవిష్ణు అన్నారు?
– ఈ సినిమాలో హీరో అతని టీమ్‌తో కలిసి ఏ పని అయితే చేశాడో అది అతడి తల్లి కోసమై ఉంటుంది. మదర్‌ గొప్పదనం గురించి చెప్పే చిత్రం ఇది. ఈ సినిమాలో రోహిణీ గారు మదర్స్‌ని రిప్రజెంట్‌ చేసే క్యారెక్టర్‌లో చాలా అద్భుతంగా నటించారు.

శ్రీవిష్ణుతో చాలా కాలంగా ట్రావెల్‌ అవుతున్నారు కదా! మీ రిలేషన్‌ ఎలా ఉంటుంది?
– నా ఫస్ట్‌ ఫిలిం ‘అసుర’లో ఆయన ఒక సాంగ్‌ చేయడం జరిగింది. అలా మంచి ఫ్రెండ్స్‌గా క్లోజ్‌ అయ్యాం. తర్వాత కథ విని బాగా ఎగ్జయిట్‌ అయ్యి నా నిర్మాణంలో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా తీశాం. అప్పటి నుండి మా ఇద్దరి జర్నీ అలా కంటిన్యూ అవుతుంది.

ఈ సినిమాలో శ్రీవిష్ణు క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?
– ఈ సినిమాలో శ్రీ విష్ణు పబ్‌లో డిజెగా కనిపిస్తాడు. రాత్రిళ్ళు చేసే జాబ్‌ కాబట్టి అతడి లైఫ్‌స్టైల్‌ మనతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటుంది. ఆ యాస్పెక్ట్‌లో కొంత నెగిటివ్‌ ట్రైబ్స్‌ కూడా ఉంటాయి. అయితే శ్రీవిష్ణు ఇప్పటివరకూ ఎమోషనల్‌ ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్స్‌లో చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్‌ కావడం వల్ల చాలా కంఫర్ట్‌గా చేశారు. అలాగే నిక్కీ తంబోలి కూడా కథను ముందుకు తీసుకెళ్లే క్యారెక్టర్‌ లో బాగా చేసింది. లవ్‌ ట్రాక్‌లో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.

మ్యూజిక్‌ గురించి?
– ఈ సినిమాకి సురేష్‌ బొబ్బిలి గారు మ్యూజిక్‌ ఇచ్చారు. గతంలో మా బేనర్‌లో వర్క్‌ చేయడం వల్ల అతనితో మంచి అసోసియేషన్‌ ఉంది. ఈ సినిమాలో మూడు పాటలు, ఒక బ్యాక్‌ గ్రౌండ్‌ సాంగ్‌ ఉన్నాయి. ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ కూడా ఉంది. అన్ని పాటలకి ప్రతి చోట మంచి రెస్పాన్స్‌ వస్తోంది. తప్పకుండా సురేష్‌ బొబ్బిలి మ్యూజిక్‌ ఈ సినిమాకి ప్లస్‌ అవుతుంది.

రోహిత్‌, శ్రీవిష్ణుతో కంఫోర్ట్‌ ఉండడం వల్ల మిగతా హీరోలతో సినిమాలు చేయడం లేదా?
– అలా ఏం కాదండీ! ఫ్రెండ్స్‌లా ట్రావెల్‌ చేస్తున్నపుడు కొంత కంఫోర్ట్‌ లెవెల్‌ ఉంటుంది అనేది నిజం. అయితే ప్రస్తుతం శ్రీ విష్ణు హీరోగా నేను ప్రొడ్యూస్‌ చేస్తున్న సినిమాలో మరో క్యారెక్టర్‌కి కొత్త హీరోని అనుకున్నాం. త్వరలో మిగతా హీరోలతో కూడా నెక్స్ట్‌ బడ్జెట్‌ లెవెల్‌తో సినిమాలు తీద్దాం అనుకుంటున్నాం. రోహిత్‌కి కొన్ని కమిట్మెంట్స్‌ ఉన్నాయి వాటి తర్వాత నా డైరెక్షన్‌లో రోహిత్‌తో మరో సినిమా ఉంటుంది. అంటూ ఇంటర్వ్యూ ముగించారు దర్శకుడు కృష్ణ విజయ్‌.ఎల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here