సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి రేపు సూపర్ సర్ప్రైజ్….!!

0
723

సూపర్ స్టార్ మహేష్, ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కనుకగా జనవరి 12న రిలైజ్ కాబోతోంది. ఇకపోతే సినిమాలతో పాటు పలు రకాల కంపెనీల యాడ్స్ లో కూడా నటిస్తూ దూసుకుపోతున్న మహేష్.

తొలిసారి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటిగా పేరుగాంచిన సాయి సూర్య డెవలపర్స్ వారి యాడ్ లో నటించడం జరిగింది. ఇక ఈ టెలివిజన్ కమర్షియల్ యాడ్ ని రేపు ఉదయం గం.09 09ని.లకు సూపర్ స్టార్ మహేష్ గారి అధికారిక యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేస్తున్నట్లు కాసేపటి క్రితం ప్రకటించారు. మహేష్ , నమ్రత, గౌతమ్, సితార కలిసి ఉన్న ఆ యాడ్ తాలూకు పిక్ ని పోస్ట్ చేసారు. ప్రముఖ యాడ్ ఫీల్ మేకర్ యమునా కిషోర్ ఈ యాడ్ ని తెరకెక్కించడం జరిగింది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here