నందమూరి బాలకృష్ణ లెజెండ్ సినిమాలో తళుక్కున మెరిసిన హీరోయిన్ రాధికా ఆప్టే సినీ వరల్డ్ లో చాలా డిఫరెంట్ గా అడుగులు వేస్తోంది. అవకాశం వచ్చిన ప్రతిసారి నటిగా తానేంటో నీరుపించుకుంటోంది. ఇక ఈ సారి అమ్మడు డైరెక్షన్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ప్రకృతి కాన్సెప్ట్ ని తీసుకొని 30 నిమిషాల షార్ట్ ఫిల్మ్ ని తెరకెక్కించింది. హీరోయిన్ గా సక్సెస్ అయిన రాధిక ఇప్పుడు డైరెక్షన్ లోకి అడుగుపెట్టడంతో న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఈ షార్ట్ ఫిల్మ్ కి స్లీప్ వాకర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. హాని ట్రెహన్ – అభిషేక్ ఈ లఘు చిత్రానికి నిర్మాతలు. గుల్షన్ దేవయ్య మరియు షహానా గోస్వామి ప్రాధాన పాత్రలో నటించారు. ఈ షార్ట్ ఫిల్మ్ లో మానవుడికి వాతావరణానికి గల ఒక స్పెషల్ రిలేషన్ ని హైలెట్ గా చూపించబోతున్నట్లు ఇటీవల నిర్మాతలు వివరించారు. ఇక ప్రస్తుతం రాధికా ఆప్టే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా షార్ట్ ఫిల్మ్ కి చివరి మెరుగులు అద్దుతోంది. గతంలో ఈ భామ 5కి పైగా షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. హీరోయిన్ అయినప్పటికీ లఘు చిత్రాలను వదిలేయకుండా వాటితో ప్రయాణాన్ని కొనసాగించింది.


