నాచురల్ స్టార్ నాని బ్యానర్ నుండి సెకండ్ మూవీ ‘హిట్’….!!

0
690

నాచురల్ స్టార్ నాని, కేవలం నటుడిగా మాత్రమే కాక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తన ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘అ’ అనే వైవిధ్యమైన సినిమాను నిర్మించి ప్రశంసలతోపాటు అవార్డులు అందుకున్నారు. ఇక తన బ్యానర్ పై రెండవ వెంచర్ గా ఒక వైవిధ్యమైన కథాంశంతో ‘హిట్’ అనే టైటిల్ తో సినిమాను ప్రారంభించారు నాని. నేడు హైదరాబాద్ లో ఈ సినిమా అధికారిక పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. తొలి సన్నివేశానికి నాని క్లాప్‌నిచ్చారు.

‘ఫలక్‌నుమాదాస్‌’ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా చి//ల//సౌ ఫేమ్ రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా శైలేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రశాంతి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంగీతం వివేక్‌ సాగర్‌ అందిస్తున్నారు. మణికందన్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేసిన నాని, మా సినిమాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అంటూ పోస్ట్ చేసారు. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here