తెలుగులో `అర్జున్‌రెడ్డి` చిత్రం సాధించిన విజయం గురించి తెలిసిందే.. ఈ చిత్రాన్ని ఇటీవల ‘కబీర్ సింగ్’ పేరుతో బాలీవుడ్ లో విడుదల చేశారు. అక్కడకూడా మంచి విజయం సాధించింది అయితే ఇప్పుడు ఈ చిత్రాన్నితమిళంలో ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంతో వెండితెరపైకి పరిచయం కాబోతున్నారు తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్. భణిత సంధు ధృవ్‌కు జోడీగా నటిస్తోంది. తొలుత ఈ సినిమాను బాలా దర్శకత్వంలో తెరకెక్కించగా. కొన్ని కారణాలవల్ల ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను సందీప్ వంగా శిష్యుడు గిరీశయ్యకు అప్పగించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
బాలా రూపొందించిన ‘వర్మ’తో పోల్చితే గిరీశయ్య ‘అర్జున్‌రెడ్డి’ ఆత్మను అందిపుచ్చుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. తెలుగు ‘అర్జున్‌రెడ్డి’లో ఘాటు సన్నివేశాలకు ఎంతటి ప్రాధాన్యముందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ్లో వెర్షన్లోనూ ఇలాంటి ఘాటైన లిప్‌లాక్‌లకు కొదువలేదు అనేలా ట్రైలర్ ఉంది. దీనికి ఉదాహరణగా తాజాగా విడుదలైన ట్రైలర్లో నాలుగైదు శాంపిల్స్‌ను కూడా చూపించేశారు. ఇక నటీనటుల విషయానికొస్తే.. ధృవ్ ఈ పాత్ర కోసం తన వంతు కృషి చేశాడనే అనిపిస్తోంది. మొదటి సినిమా అయినా మంచి పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. ఇక భణిత సంధు నటన బాగుంది . ట్రైలర్లో చూపించిన సన్నివేశాలను చూస్తుంటే మాతృకను ఎక్కడా పక్కదారి పట్టించకుండా ఉన్నది ఉన్నట్లుగా తెరపైకి తీసుకొస్తున్నట్లుగా అర్థమవుతోంది. గిరీశయ్య మేకింగ్ స్టైల్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం.. తమిళ్ లో నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.


