RRR అప్ డేట్ : ‘కొమరం భీం’ గా ఎన్టీఆర్ గారి లుక్ స్క్రీన్ పై అదిరిపోతుంది….!!

0
651

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ మల్టీస్టారర్ మూవీ RRR. స్వాతంత్రోద్యమ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీంగా, అలానే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే నేడు తెలంగాణ విప్లవ వీరుడు కొమరం భీం జయంతిని పురస్కరించుకుని RRR మూవీ టీమ్, సినిమాలోని ఎన్టీఆర్ గారి లుక్ పై ఒక అప్ డేట్ ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఇవ్వడం జరిగింది.

‘స్వాతంత్రోద్యమ పోరాట వీరుడు కొమరం భీం గారి జయంతి సందర్భంగా మా RRR సినిమా టీమ్ భీం గారి శౌర్యం మరియు గొప్పతనాన్ని గుర్తుచేసుకుంటోంది. ఈ సినిమాలో ఆయన పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ గారి లుక్ అదిరిపోతుందని, ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల మాదిరిగిగా తాము కూడా ఆయనను స్క్రీన్ పై చూడాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నట్లు వారి పోస్ట్ లో తెల్పడం జరిగింది. కాగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది జులై 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here