బాలీవుడ్ లో మరో హిట్టు కొట్టిన తాప్సి

0
586

ఝుమ్మంది నాథం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సొట్ట బుగ్గల సుందరి తాప్సి పన్ను. తన అందంతో కెరీర్ మొదట్లో తెలుగుకి ఆడియెన్స్ కి బాగా దగ్గరైన ఈ బ్యూటీ ఇప్పుడు ప్రయోగాత్మక చిత్రాలతో బాలీవుడ్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. సినిమాలు రిలీజ్ కు ముందే మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి అంటే తాప్సి లక్కు ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఈ నెల 25న తాప్సి నటించిన ‘సాండ్ కి ఆంఖ్’ అనే సినిమా రిలీజ్ కాబోతోంది.

షార్ప్ షూటర్ గా సత్తా చాటిన ప్రకాశి తోమర్ పాత్రలో తాప్సి ఈ సినిమాలో నటించింది. అలాగే చండ్రు తోమర్ పాత్రలో భూమి పడ్నేకర్ నటించింది. రీసెంట్ గా మీడియాకు స్పెషల్ షోను ప్రదర్శించిన చిత్ర యూనిట్ పాజిటివ్ రివ్యూలను అందుకుంది. సినిమాలో తాప్సి నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. దీంతో సినిమా రిలీజ్ కు ముందే అమ్మడు బాలీవుడ్ లో మరో హిట్టు కొట్టేసిందని చెప్పవచ్చు.

ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా దీపావళి సెలబ్రేషన్స్ లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా సాలిడ్ గా అందే అవకాశం ఉంది. అయితే పోటీగా మరో బాలీవుడ్ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. అక్షయ్ కుమార్ హౌజ్ ఫుల్ 4 దీపావళి కానుకగా రిలీజ్ కాబోతోంది. రెండు కూడా డిఫరెంట్ జనర్స్ లో తెరకెక్కిన సినిమాలు కాబట్టి మంచి ఓపెనింగ్స్ అందే అవకాశం ఉంది. మరి తాప్సి సినిమా ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here