రవితేజ డిస్కో ‘రాజా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్….!!

0
877

మాస్ మహారాజా రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న తాజా సినిమా డిస్కో రాజా. రజిని తాళ్లూరి నిర్మాతగా వ్యహరిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. ఇకపోతే ఈ సినిమాలోని ‘నువ్వు నాతో ఏమన్నవో’ అనే పల్లవితో సాగె ఫస్ట్ లిరికల్ సాంగ్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

థమన్ స్వరపరిచిన మెలోడియస్ ట్యూన్ కి, గాన చక్రవర్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు తన మధురమైన గాత్రంతో ఈ పాటను ఎంతో హృద్యంగా ఆలపించడం జరిగింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం నుండి జాలువారిన అందమైన సాహిత్యం, ఈ పాటకు మరింత ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటూ మంచి వ్యూస్ తో దూసుకుపతోంది. రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here