24 క్రాఫ్ట్‌లలో అతి ముఖ్యమైనది రచనా విభాగం. అటువంటి రచనా విభాగానికి పుట్టిల్లు తెలుగు సినీ రచయితల సంఘం. తెలుగు సినీ రచయితల సంఘానికి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2019 నవంబర్ 3వ తారీఖున హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో తెలుగు సినీరచయితల సంఘం రజతోత్వాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పలువురు అగ్ర రచయితలు పాల్గొని 1932 దశకం నుంచి ఈ దశకం వరకు తెలుగు చిత్రసీమ అభివృద్ధి కోసం వచ్చిన సినీ రచయితల కృషిని గుర్తుచేసుకున్నారు. దీనికి సంబంధించిన ఒక టీజర్‌ను రెబల్ స్టార్ కృష్ణంరాజు
విడుదల చేశారు. కార్యక్రమం బలభద్రపాత్రుని రమణి స్వాగతంతో ప్రారంభమైంది. ప్రధాన కార్యదర్శి ఆకెళ్ల, పరుచూరి వెంకటేశ్వరరావు సంఘం తొలినాటి విశేషాలను వివరించారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ… రచయితల సంఘం అనేకంటే ‘సరస్వతీ పుత్రి- పుత్రికల సంఘం’ అంటాను నేను. ఎందుకంటే మా నాన్న గారు చెప్పారు ‘లక్ష్మి ఎదురు వస్తే నమస్కరించు…కానీ సరస్వతి ఎక్కడవున్నా వెళ్లి నమస్కరించమని’. రచయితలకు కాన్‌సన్‌ట్రేషన్, అంకితభావం వుండాలి. అలా ఎంతోమంది పెద్దలున్నారు. ప్రస్తుతం కాలంతోపాటు రచనల్లో మార్పు వచ్చింది. దానికి అనుగుణంగానే రచయితలు వుంటారు. పిల్లలకు మనం చెబితే దాన్నే ఆచరిస్తారు. అదేవిధంగా రచయితలు రాసిన మాటలే ప్రేక్షకుల్లో పాపులర్ అవుతాయి. మంచి మార్గంలో దోహదపడేలా వుండాలి. నేను చాలా పెద్ద పెద్ద మహానుభావులతో పని చేశాను. ఆత్రేయగారు ఏదన్నా సీన్ రాసే ముందు ఆయన ఆ క్యారెక్ట్‌లోకి వెళ్లిపోయి డైలాగ్‌లు రాస్తారు. అందరూ రాస్తారు కాని డైలాగ్ అంటే నువ్వు రాసిందికాదు ఉచ్చరించేది అనేవాడ్ని. రచయితలు మహానుభావులు వంటివారు.నేను రచయితల సంఘం సభ్యుడినే అన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ.. సినిమా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది. గ్రీకు పదం కినిమా అనే పదం నుంచి వచ్చింది. కినిమా గ్రాఫ్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది.1890 నుంచి చాలా చరిత్ర ఉంది. భారతదేశంలో మొట్ట మొదటి ఫిబ్రవరి 21, 1896లో లండన్‌లో లివింగ్ ద ట్రైన్ అనే లఘు చిత్రాలు ఉన్నాయి. 1932 ఫిబ్రవరి 6న భక్త ప్రహ్లాదతో మొదలైందన్నారు. 1936లో ఒకేసారి ఏడుగురు రచయితలు ప్రవేశించారు. 1943లో బలిజేపల్లిలక్ష్మీకాంత్ గారు కూడా ఒక కథ రాశారు . ప్రేమవిజయం తొలిసాంఘిక చిత్రం 1936లో నాగేశ్వరరావు,1937లో సినిమా ఇండస్ట్రీకి పరిచయమై 1980 వరకు 50కి పైగా చిలుకు సినిమాలు రచించారు. కులాంతర వివాహమైన మాలపిల్ల చాలా పెద్ద హిట్ అయింది. రైతు బిడ్డ అందరం గుర్తుపెట్టుకోవాల్సిన చిత్రం మొట్ట మొదటి సారి బ్యాన్ చేసిన చిత్రం. పునర్వివాహం పై వైవి.రెడ్డిగారు ఒక సినిమా తీశారు. ఆ రోజుల్లో పద్యానికి దగ్గరగా పాట కూడా ఉండేది. అన్నారు.
ఎస్.వి. రంగారావు మాట్లాడుతూ… సముద్రాల రాఘవాచారికి దక్కుతుంది. భక్తపోతన, త్యాగయ్య , వేమన గొప్పవారు గొప్పగొప్ప సంగతులను చెప్పారు. బాలసుబ్రమణ్యంని సింగర్‌గా పరిచయం చేసిన సంవత్సరం కూడా అదే. లైలామజ్ను చిత్రంలో ఉర్దూ పదాలను పెట్టారు. ఎల్ వి. ప్రసాద్‌గారికి హిందీ పాటలను తెలగులో పెట్టడం అలవాటు. పక్షిరాజా తీసినటువంటి త్రుతగారు 30ఏళ్ళు రచయితగా పనిచేశారు.. సముద్రాల రాఘవాచారి నుంచి చక్రపాణి వరకు సాగిన చరిత్రను గుర్తు చేశారు.
నాగబాలసురేష్ మాట్లాడుతూ… 1951 నుంచి 60 వరకు జరిగిన సినిమాల గురించి వాటిలో రచయితలు, దర్శకుల గురించి వివరించారు. పాతాళభైరవి, మిస్సమ్మ, ప్రపంచస్థాయిలో అవార్డులు అందుకున్న దశాబ్ధం ఇదే. గ్రాంధిక భాషలో అలవాటై నిత్యకృతి షావుకారు అనే చిత్రం వాడుక భాషలో తీసి నానుడికి శ్రీకారం చుట్టిన చిత్రమని పేర్కొన్నారు.
1961-70వడ్డేపల్లి కృష్ణమూర్తి... 1932 నుంచి సాగిన సినీ ప్రస్థానంలో స్వర్ణయుగం లాంటిది. ఆణిముత్యం లాంటి చిత్రాలు ఈ దశాబ్ధంలో ఉన్నాయి. ఎన్టీఆర్, ఎఎన్నార్‌లను అగ్రస్ధాయికి తీసుకెళ్‌ళింది కూడా ఈ దశాబ్దధమే సినారె, లాంటి గొప్ప గొప్ప కవులను కూడా ఈ దశాబ్ధమే రంగుల ప్రపంచం కూడా ఇప్పడే మొదలైంది. ఇద్దరు మిత్రలు చిత్రం ద్వారా దాశరధిగారు పరిచం అయ్యారు. వెలుగునీడలు చిత్రం ఇప్పటికీ చిరస్మరణీయం పాడవోయి భారతీయుడా ఆడిపాడవోయి అన్న అన్న పాట ఇప్పటికీ పాడుకుంటాం. జగదీకవీరునికథ, గులేభకావళి కథ రెండూ ఒకే సంవత్సరంలో విడుదలయ్యాయి. నన్నుదోచుకుందువటే అంటే అందరి మనసులను దోచుకున్నారు సినారే గారు. గుండమ్మకథ సాంఘికంగా గుర్తుండిపోతుంది. శ్రీకృష్ణార్జుల యుద్ధం చాలా బాగా కుదిరింది.
రత్నబాబు డైరెక్టర్… ఇక్కడున్న రచయితలు ఎంతో గొప్పగవారు. 666 యాప్‌లను వదిలి ఒక సినిమా థియేటర్‌కి రప్పించడం గొప్ప విషయం. ఈగని కూడా గొప్పగా చేసింది ఒక రచయిత. అన్నారు.


