దిల్ రాజు, క్రిష్ నిర్మాతలుగా అవసరాల శ్రీనివాస్ ‘నూటొక్క జిల్లాల అందగాడు’….!!

0
831

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు మరియు దర్శకుడు క్రిష్, వై రాజీవ్ రెడ్డితో కలిసి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నూటొక్క జిల్లాల అందగాడు’.

నటుడు మరియు దర్శకుడైన అవసరాల శ్రీనివాస్ హీరోగా, చిలసౌ మూవీ ఫేమ్ రుహాని శర్మ హీరోయిన్ గా తెరకెక్కనున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు నేడు హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా జరిగాయి. దేవుని పటాలపై చిత్రీకరించిన తొలి షాట్ తో ప్రారంభమైన ఈ సినిమాను నూతన దర్శకుడు సాగర్, మంచి ఫన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలోని ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడి కానున్నాయి….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here