సక్సెస్ బ్యూటీ హాట్ స్టిల్

0
758

భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ కి దగ్గరైన బ్యూటీ కియారా అద్వానీ. బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న ఈ బ్యూటీ మంచి క్రేజ్ అందుకుంటోంది. ఆమె చేసిన సినిమాలు చాలావరకు బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో సరికొత్తగా ఆదర్శనమిస్తున్న అమ్మడు రీసెంట్ గా మరో గ్లామర్ పిక్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గ నిలిచింది.

బ్లాక్ డ్రెస్ లో సొగసులను సముద్ర తీరాల్లో ఆరేసినట్లు హాట్ స్టిల్ ఇచ్చింది. పడవపై నిలబడి స్టయిలిష్ గా కనిపించిన కియారా బ్యూటిఫుల్ ఏంజిల్ లా ఉందని స్పెషల్ కామెంట్స్ అందుతున్నాయి. చివరగా తెలుగులో వినయ విధేయ రామ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ అవకాశం వస్తే మరిన్ని తెలుగు చిత్రాలు చేయడానికి ఎల్లపుడు సిద్ధంగా ఉంటానని పలు ఇంటర్వ్యూలలో వివరణ ఇచ్చింది.

ఇక కబీర్ సింగ్ అనంతరం అమ్మడి క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ గా వచ్చిన ఆ సినిమా 300కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని అందుకొని 2019 టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఆమె చేతిలో ప్రస్తుతం 5 పెద్ద సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా అక్షయ్ ‘లక్ష్మి బాంబ్’ తో పాటు భూల్ బులియా సీక్వెల్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here