ప్రాధాన్యత గల పాత్ర దొరికితే బాలీవుడ్ లో నటించడానికి సిద్ధం : విజయ్ దేవరకొండ

0
587

టాలీవుడ్ సెన్సేషన్ హీరోగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఒక సినిమా, అలానే క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే మరొక సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అలానే వాటితో పాటు త్వరలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడ మరొక సినిమాలో కూడా నటించనున్నారు.

ఇకపోతే నేడు హాలీవుడ్ సెన్సేషనల్ మూవీ ‘టెర్మినేటర్ డార్క్ ఫేట్’ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ వేడుకలో పాల్గొని ట్రైలర్ ని తన చేతుల మీదుగా రిలీజ్ చేసిన విజయ్, తనకు టెర్మినేటర్ సిరీస్ లోని సినిమాలంటే ఎంతో ఇష్టం అని, అలానే ఈ సినిమాను ఇంగ్లీష్, తెలుగు రెండు భాషల్లో కూడా తాను మిస్ కాకుండా చూస్తానని న్నారు. రాబోయే 2020వ సంవత్సరం తనకు ఎంతో ప్రత్యేకమని, వచ్చే ఏడాది మరిన్ని మంచి సినిమాలు చేస్తాను అంటున్న విజయ్, తనను ఆకట్టుకునే మంచి ప్రాధాన్యత గల క్యారెక్టర్ దొరికితే బాలీవుడ్ మూవీలో నటించడానికి తాను సిద్ధం అని అన్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here