ఆడియన్స్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ‘రాజుగారి గది-3’ సక్సెస్ తో ప్రూవ్ చేస్తాం – దర్శకుడు ఓంకార్.

0
574

రాజుగారి గది, రాజుగారి గది-2 చిత్రాలు సూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఆ సిరీస్ లో భాగంగా అశ్విన్ బాబు కథానాయకుడిగా అవికా గోర్ హీరోయిన్ గా ఓంకార్ స్వీయ దర్శకత్వంలో ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తోన్న చిత్రం “రాజుగారి గది-3”. అక్టోబర్ 18 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్స్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో….

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ – “రాజుగారి గ‌ది’ చిత్రంతో ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ అయ్యారు రాజుగారిగది 2 చిత్రంలో కాస్త ఎంటర్టైన్మెంట్ తగ్గిందని అందుకే రాజుగారిగది 3 చిత్రాన్ని అందరికీ నచ్చేట్లుగా సాలిడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిస్తానని దర్శకుడు ఓంకార్ నాతో చెప్పారు. జీనియ‌స్ సినిమా నుండిఓంకార్ తో జ‌ర్నీ చేస్తున్నాను. ఇప్పుడే సినిమా చూశాను. ఓంకార్ చెప్పిన‌ దానికంటే చాలా అద్భుతంగా ఉంది. హీరో వాళ్ళ త‌మ్ముడు అశ్విన్ బాబు అన్నప్పుడు సూట్ అవుతాడా లేదా అని అనుకున్నా కానీ అన్నీ పర్ఫెక్ట్ గా చేశాడు. అశ్విన్ చాలా గ్రేట్‌ యాక్టర్. హండ్రెడ్ ప‌ర్సెంట్ ఒక క‌మ‌ర్షియ‌ల్ హీరోకి ఏం కావాలో అన్నీ చేశాడు. నా అన్ని సినిమాల్లోనూ నేను ఇంత సర్ప్రైజ్ అయింది అశ్విన్ విషయంలోనే..అవికా గోర్ మెస్మరైజింగ్ పెర్ఫామెన్స్ ను ఈ సినిమాలో మీరు చూస్తారు. ఈ సినిమా తరువాత ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయి. ఏ ఫిలిం బై ఓంకార్ అనడానికి ఈ సినిమా ఉదాహరణ. ఆయన సెలెక్ట్ చేసిన టెక్నిషన్స్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరారు. రాజుగారి గ‌ది 3 తప్పకుండా సెన్సేష‌న‌ల్ హిట్ అవుతుంది” అన్నారు.

హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ – “నా డ్రీమ్ రేపు అక్టోబర్ 18 న మీరందరూ థియేటర్స్ లో చూడ‌బోతున్నారు. ‘జీనియ‌స్’ మొదలుపెడితే నేను ఒక ఐదు చిత్రాల్లో చేశాను. కానీ ఛోటా కె.నాయుడు అన్న లాంటి పెద్ద టెక్నీషియ‌న్‌తో వర్క్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది అంటున్నారు. నేను కూడా మీతో కలిసి చూడలని వెయిట్ చేస్తున్నా.. ఈ సినిమా జూన్ 21న మొద‌లై అక్టోబర్ 18 న విడుదలవుతుంది అంటే దానికి మొయిన్ కార‌ణం కాస్ట్ అండ్ క్రూ. ఎవ్వ‌రూ మ‌మ‌ల్ని ఇబ్బంది పెట్ట‌లేదు. అందుకే సినిమా అంత బాగా వచ్చింది. అంద‌రూ సినిమా చూసి మ‌మ్మ‌ల్ని బ్ల‌స్ చేయండి” అన్నారు.

హీరోయిన్ అవికాగోర్ మాట్లాడుతూ…”మొద‌టిసారి నేను చాలా నెర్వ‌స్‌గా ఫీవుతున్నాను. ఎందుకంటే ఇది నాకు చాలా స్పెష‌ల్‌గా, నా ఓన్ ఫిలిం గా ఫీల‌వుతున్నారు. ఈ టీమ్ నా ఫ్యామిలీగా భావిస్తున్నాను. ఆడియ‌న్స్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఛోటా గారు, ఓంకార్‌ బ్ర‌ద‌ర్స్ ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. అందరికీ న హృదయ పూర్వక కృతజ్ఞతలు” అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను మాట్లాడుతూ – “నేను గతంలో ‘హుషారు’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘గద్దలకొండ గణేష్’, హ్యాట్రిక్ సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేశాను. ఈ ‘రాజుగారి గది’ దాన్ని కంటిన్యూ చేస్తుందని భావిస్తున్నాను. నామీద నమ్మకంతో ఇంతపెద్ద భాద్యతను ఇచ్చినందుకు ఓంకార్ గారికి, అశ్విన్ బాబు గారికి థాంక్స్. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఇది మూడవసారి ముత్యం అంటారు కదా! అలాంటి సినిమా ఇది” అన్నారు.

దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ – “ఇంకో రెండు రోజుల్లో విడుద‌ల కాబోతుంది. ఈ సినిమా చిన్న పిల్ల‌ల‌తో స‌హా చూసి ఎంజాయ్ చెయ్య‌వ‌చ్చు. ఈ సినిమా రెండు గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. థ్రిల్స్, చిల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ.. అతి త‌క్కువ టైంలో ఈ సినిమాని కంప్లీట్ చెయ్య‌డానికి కారణమైన ప్రతి టెక్నీషియ‌న్, ఆర్టిసులకి ధన్యవాదాలు. ఈ రోజు నేను ఇంత మంచి పొజిషన్ లో ఉండడానికి కారణం నా తమ్ముళ్లు అశ్విన్, క‌ళ్యాణ్. ఇద్దరూ న‌న్ను న‌మ్ముకుని నాతో ఉంటూ న‌న్ను స‌పోర్ట్ చేస్తూ చాలా హెల్ప్ చేశారు. నేను యాంకర్ అయినప్పటినుండి అశ్విన్‌ని మంచి హీరోని చేయాలనీ, క‌ళ్యాణ్‌ని ప్రొడ్యూస‌ర్ చేయాలనీ అనుకునేవాడిని. ఈ సినిమాతో ఆ రెస్పాన్సిబిలిటీ ని నేను నెరవేర్చుకోబోతున్నాను. మీరందరూ మ‌మ్మ‌ల్ని త‌ప్ప‌కుండా స‌పోర్ట్ చేయాలనీ కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ‌కు నేను తప్ప ఎవ్వ‌రూ లేరు. మాకు మీరున్నారన్న ధైర్యం ఉంది. ఏడాది క్రితం మా నాన్న గారు చనిపోయారు. అప్పటినుండి నేను ఇదే వైట్ డ్రెస్ లో ఉంటున్నాను. ఎందుకంటే ఈ డ్రెస్ వేసుకుంటే నాన్న‌గారు నాతో ఉన్నారన్న నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం తోనే వేసుకుంటున్నాను. అశ్విన్‌ని మంచి హీరో చేసే వరకూ ఈ డ్రెస్ తీయకూడదు అనుకున్నాను. రేపు సినిమా చూసి ఒక మంచి హీరోగా రిసీవ్ చేసుకుంటే నేనునార్మల్ డ్రెస్ లోకి వస్తాను. చోటానే నాకు ఒక అన్న. ఇప్ప‌టికీ రెమ్యూన‌రేష‌న్ మాట్లాడ‌లేదు, ఒక్క మాట కూడా అడ‌గ‌లేదు. అంత పెద్ద డిఒపి క‌నీసం రెమ్యూన‌రేష‌న్ అడ‌గ‌లేదంటే అంత ఈజీకాదు.మీరు మా మీద పెట్టుకున్న న‌మ్మ‌కం రేపు 18 న ప్రూవ్ అవుతుంది. వరంగల్ శ్రీను ఆయనది చాలా ల‌క్కీ హ్యాండ్. ఈ సినిమాతో అందరం పెద్ద హిట్ కొట్టబోతున్నాం” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here